ఎ1 వైయస్.. ఎ6 టిడిపి: విభజనపై సోమిరెడ్డి నిప్పులు

తెలుగు జాతిని నాశనం చేయడమే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆఖరు కోరిక అని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు దొరకని ప్రధానమంత్రి అపాయింటుమెంట్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు ఎలా దొరికిందని ఆయన ప్రశ్నించారు. చంచల్ గూడ జైలు జగన్ పార్టీ బ్రాంచ్ ఆఫీసుగా మారిందన్నారు.
వైయస్ అసమర్థత వల్లే అన్యాయం: దేవినేని
వైయస్ అసమర్థత వల్లే కృష్ణా ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఆంధ్రా, తెలంగాణ ఎంపీల మధ్య తగాదా పెట్టారని ఆరోపించారు. కృష్ణా జలాల కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన ఆంధ్రా, తెలంగాణ రైతుల మధ్య చిచ్చు పెట్టారన్నారు. కృష్ణా జలాల్లో మనకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెసు ఎంపీలతా పోరాడాలని, గతంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహా ధర్నా చేశారన్నారు.
ఇటలీ మాఫియా: గోరంట్ల
రాష్ట్ర విభజన నిర్ణయం వెనుక ఇటలీ మాఫియా కుట్ర ఉందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలో జలవివాదాలు పుష్కలంగా ఉన్నాయని, హైదరాబాదుతో సీమాంధ్రులకు విడదీయరాని బంధముందన్నారు. రాహుల్ గాంధీకి పట్టం కట్టేందుకే సోనియా విభజన అంశాన్ని తెర పైకి తీసుకు వచ్చారన్నారు. విభజనను ఎంత మాత్రం సహించేది లేదన్నారు. పిసిసీ చిఫ్ బొత్స, కేంద్రమంత్రులు, ఎంపీలు విభజన విషయం తెలిసనా మౌనం దాల్చాలన్నారు.












Click it and Unblock the Notifications