ఢిల్లీలో విజయమ్మ, బలరాంతో నటి రమ్య (పిక్చర్స్)

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జెడి(యు) అధినేత శరద్ యాదవ్ తదితరులను కలిశారు.

ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమయంలో రాష్ట్రపతి వారి నుండి వైయస్ జగన్ దీక్ష పైన ఆరా తీశారు. తనకు సమాచారముందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండి ఉండేది కాదని ప్రధాని తమతో అన్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు.

మరోవైపు పార్లమెంటు ఆవరణలో కేంద్రమంత్రి బలరామ్ నాయక్ ఇటీవలె కర్నాటక మాండ్య నియోజకవర్గం నుండి గెలుపొందిన ప్రముఖ నటి రమ్యను అభినందించారు. ఆమెకు పలువురు అభినందలు తెలియజేశారు.

శరద్ యాదవ్‌తో...

శరద్ యాదవ్‌తో...

విభజనతో సమన్యాయం జరిగేలా చూడాలని లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ జెడి(యు) అధినేత శరద్ యాదవ్‌ను కలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు.

శరద్ యాదవ్‌ మాటా మంతి

శరద్ యాదవ్‌ మాటా మంతి

విభజనతో సమన్యాయం జరిగేలా చూడాలని లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ తనను కలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో మాట్లాడుతున్న జెడి(యు) అధినేత శరద్ యాదవ్.

పార్లమెంటు

పార్లమెంటు

పార్లమెంటు ఆవరణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, శోభా నాగి రెడ్డి, మైసూరా రెడ్డి, కొణతాల రామకృష్ణ, తదితరులు.

బలరాంతో రమ్య

బలరాంతో రమ్య

కేంద్రమంత్రి బలరాం నాయక్‌తో ఇటీవల కర్నాటక మాండ్య లోకసభ స్థానం నుండి ఉప ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖ నటి, ఎంపి రమ్య.

విజయమ్మ

విజయమ్మ

రాష్ట్ర విభజనపై ఢిల్లీలో పలువురు నేతలను కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, పార్టీ నేతలు మైసూరా రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొడాలి నాని తదితరులు.

విలేకరులతో

విలేకరులతో

ఢిల్లీ నేతలను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ.

మందా - వివేక్

మందా - వివేక్

పార్లమెంటు ఆవరణలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు జి.వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు. కాగా, వీరు ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+