1 నుండి బాబు ఆత్మగౌరవ యాత్ర: విడతలుగా టూర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర సెప్టెంబర్ 1వ తేది నుండి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా గురజాల మండలం దాచేపల్లి మండలంలోని పొందుగుల గ్రామం నుండి బాబు యాత్ర ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
పొందుగుల నుండి ప్రారంభం కానున్న ఈ యాత్ర గుంటూరులో వారం రోజుల పాటు కొనసాగుతుంది. గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో యాత్ర సాగుతుందని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లా రావు మంగళవారం తెలిపారు.

వాస్తవానికి యాత్రను ఈ నెల 25 నుంచే ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు భావించారు. పలు కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా పడింది. అనంతరం తాజాగా బాబు గుంటూరు జిల్లా నేతలతో మంగళవారం రాత్రి మాట్లాడారు. యాత్ర అంశం వారి మధ్య చర్చకు వచ్చింది. ఈ యాత్ర ఏకధాటిగా కాకుండా పలు దఫాలుగా చేపట్టాలని బాబు భావిస్తున్నారు.
గీతారెడ్డి ఇంట్లో తెలంగాణ నేతల భేటీ
మరోవైపు మంత్రి గీతా రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు, మంత్రులు బుధవారం సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications