వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోలు: ఢిల్లీలో విజయమ్మ ధర్నా, డిగ్గీ ఇంటి ముట్టడి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు దేశ రాజధాని ఢిల్లీకి పాకినట్లు కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. తెలంగాణవాదులు కూడా ఢిల్లీకి చేరుకుని సమైక్యవాదుల ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఢిల్లీ కూడా రాష్ట్ర రాజకీయాలతో వేడెక్కింది.

రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ నివాసం ఎదుట బుధవారం సీమాంధ్ర ఉద్యోగులు నిరసన చేపట్టారు. దిగ్విజయ్‌ను సీమాంధ్ర ఉద్యోగులు కలుసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్ ఇప్పటికే విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలని ఆయన సూచించారు.

దీంతో సీమాంధ్ర ఉద్యోగులు సమావేశం మధ్యలోనే బయటకు వచ్చి దిగ్విజయ్ సింగ్ నివాసం ఎదుట నిరసన చేపట్టారు. అప్పుడే మంత్రులు వట్టి వసంతకుమార్, ఆనం రామ్‌నారాయణ రెడ్డి వస్తుండగా వారిని అడ్డుకుని తమ పదవులకు రాజీనామా చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అంతలోనే దిగ్విజయ్ సింగ్ కారులో బయటకు వస్తుండగా ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దిగ్విజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

తెలంగాణకు అనుకూలంగా ఎమ్మెల్సీ కె. దిలీప్ కుమార్ నేతృత్వంలో తమ డిమాండ్‌ను వినిపించడానికి ఓ బృందం ఢిల్లీ చేరుకుంది. నేషనల్ ఫాంథర్స్ పార్టీ కార్యదర్శి నస్రీన్, తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు.

వైయస్ విజయమ్మ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష

వైయస్ విజయమ్మ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగర్ెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం దీక్షకు దిగారు. ఆమె రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు.

వైయస్ చిత్రానికి పూలమాల

వైయస్ చిత్రానికి పూలమాల

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత వైయస్ విజయమ్మ తన దీక్షను ప్రారంభించారు. రాష్ట్రం కలిసి ఉండాలని వైయస్ రాజశేఖర రెడ్డి కోరుకున్నారని ఆమె చెప్పారు.

వైకాపా నేతలంతా...

వైకాపా నేతలంతా...

వైయస్ విజయమ్మకు సంఘీభావంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంటేశ్వర్లు, తదితరులు దీక్షలో బైఠాయించారు.

సామాజిక తెలంగాణ...

సామాజిక తెలంగాణ...

సామాజిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగావాదులు వైయస్ విజయమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఆ వినతిపత్రాన్ని విజయమ్మ స్వీకరిస్తూ ఇలా...

దిగ్విజయ్ సింగ్ ఇంటి ముట్టడి

దిగ్విజయ్ సింగ్ ఇంటి ముట్టడి

సీమాంధ్ర ఉద్యోగులు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఇంటిని ముట్టడించారు. రాష్ట్ర విభజన తప్పదని ఆయన చెప్పడంతో సీమాంధ్ర ఉద్యోగులు ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

నీటి కోసం అన్నదమ్ముల్లా తన్నుకోవాలా

నీటి కోసం అన్నదమ్ముల్లా తన్నుకోవాలా

నీటి కోసం అన్నదమ్ముల్లా తన్నుకోవాలా అనే నినాదం రాసి ఉన్న ప్లకార్డుతో వైయస్ విజయమ్మ దీక్షలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఇలా...

మీడియా సమావేశం..

మీడియా సమావేశం..

ఎమ్మెల్సీ కె. దిలీప్ కుమార్ నేతృత్వంలోని టిఎర్ఎల్‌డి ప్రతినిధులు, నేషనల్ పాంథర్స్ పార్టీ నేతలు నస్రీన్, రాజీవ్ కోస్లా, మా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్ ధర్మాసనం తెలంగాణకు అనుకూలంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సహకరించాలని వారు సీమాంధ్రులను కోరారు.

English summary
YSR Congress honorary president YS Vijayamma staged dharna in Delhi opposing Andhra Pradesh bifurcation decission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X