వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రమిచ్చాం, రెచ్చగొట్టకండి: టి నేతలకు ఆంటోని కమిటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Give T fast, says Telangana leaders
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలు, నేతలు విభజన పట్ల ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సంయమనం పాటించాలని, వారిని మరింత రెచ్చగొట్టకూడదని ఆంటోనీ కమిటీ సభ్యులు తెలంగాణ కాంగ్రెసు ఎంపీలకు మంగళవారం సూచించారు. విభజనపై నిర్ణయం జరిగినందువల్ల ప్రశాంతంగా ఉండాలని వారికి సూచించారు. కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, ఎంపీలు పొన్న ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఆనంద భాస్కర్, ఎంఏ ఖాన్ తదితరులు మంగళవారం రాత్రి ఆంటోనీ కమిటీ సభ్యులను కలిశారు.

తమపై సీమాంధ్ర నేతలు చేస్తున్న ఫిర్యాదులు సరైనవి కాదని వారు వివరించారు. సీమాంధ్రకు చెందిన టిడిపి ఎంపీలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించినా ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోలేదని, పైగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వాళ్లను కలిసి సంఘీభావం ప్రకటించారని పొన్నం ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా తాము సంయమనంతో ఉన్నామని అన్నారు.

విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని, ప్రక్రియ అమలు అవుతుంటే పరిస్థితి సద్దుమణుగుతుందని వారు వివరించారు. వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి సీమాంధ్ర ప్రజలకు సమయం పడుతుందని, వారు దిగ్భ్రాంతిలో ఉన్నారని చెప్పారు. తాము వారి ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, స్నేహహస్తం అందిస్తామని కూడా తాము భరోసా ఇచ్చామని, వారే తమను రెచ్చగొడుతున్నామని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అయితే, సంయమనం పాటించాలని ఆంటోని కమిటీ వారికి సూచించింది.

సంప్రదింపులు జరిగాకనే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు ఏకపక్ష నిర్ణయం అనడం టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రచారం చేయడం సరికాదన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాకనే నిర్ణయం జరిగిందన్నారు.

English summary

 Union Ministers from Telangana and Congress MPs requested the AK Antony Committee to speed up the process of carving out at separate Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X