మందుబాబు కరవడంతో శునకం మరణం

తీవ్రంగా గాయపడిన కుక్కను గుర్తించిన ఆటోడ్రైవర్ కృష్ణమూర్తి దానిని పశువైద్యశాలలో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యులు కుక్కకి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. మంగళవారం సాయంత్రం అది మరణించినట్లు కృష్ణమూర్తికి పశువైద్యశాల తెలిపింది. కుక్కను కరిచిన వ్యక్తి కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆదివారంనాడు తనను చూసి మొరుగుతున్న కుక్కపైకి రాయి చూపి అతను బెదిరించాడు. అయినా అది బెదరలేదు. దాంతో మద్యం మైకంలో ఉన్న కుమార్ దాని మీద పడి దాన్ని బలంగా పట్టుకుని చెవి కొరికేశాడు. అప్పటికీ కసి తీరక తన జేబులో ఉన్న కత్తి తీసి దాని రెండో చెవిని కోసిపారేశాడు.
చెవుల నుంచి రక్తం కారుతుంటే బాధ భరించలేక అది ఏడుస్తుండడం చూసిన ఆటో డ్రైవర్ సమీపంలోని పశువైద్యశాలలో చేర్చి చికిత్స చేయించాడు. పరారైన ఆ తాగుబోతుపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications