వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యునాని డాక్టర్‌నని చెప్పిన యాసిన్ భత్కల్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ తాను యునాని డాక్టర్‌నని చెప్పి భారత అధికారుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. గత ఆరు నెలలుగా అతని కోసం జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఎ)తో పాటు ఇతర సంస్థలు కాపు కాస్తున్నట్లు సమాచారం. తాను యాసిన్ భత్కల్‌ను కానని, యునాని వైద్యుడినని చెప్పి తప్పించుకోవడానికి అతను ప్రయత్నించినట్లు సమాచారం.

బంగ్లాదేశ్‌కు వెళ్లడానికి అతను నేపాల్‌లోకి ప్రవేశించాడని, నేపాల్ లోపలికీ బయటకూ సంచరిస్తూ వస్తున్నాడని, గత నెల రోజులుగా అతను ఇదే పనిచేస్తున్నాడని తెలుస్తోంది. బుధవారం రాత్రి అతన్ని బీహార్ పోలీసులు అతన్ని పట్టుకోగలిగారు. తనను పట్టుకోగానే తాను ఇంజనీర్‌నని, నేపాల్‌లో ఓ ప్రాజెక్టుపై పనిచేస్తున్నానని చెప్పాడని సమాచారం.

Yasin Bhatkal

తాను యునాని వైద్యుడినని, ఇస్లామిక్ సంప్రదాయ వైద్య పద్ధతులను ఆచరిస్తుంటానని ఆ తర్వాత యాసిన్ భత్కల్ చెప్పాడని సమాచారం. అదే పేరుతో అతను బీహార్‌లో దర్బంగాలో టెర్రర్ మోడ్యూల్‌ను స్థాపించాడని చెబుతున్నారు.

అయితే, చిత్రాలు మాత్రం తప్పకుండా అతను భారత్‌కు కావాల్సిన 12 మంది ఉగ్రవాదుల్లో ఒక్కడైన యాసిన్ భత్కల్ అనే విషయాన్ని తేల్చాయి. పట్టు విడవకుండా విచారించిన నేపథ్యంలో అతను చివరికి తాను యాసిన్ భత్కల్‌నని అంగీకరించాడు.

English summary
Yasin Bhatkal, Indian Mujahideen co-founder and one of India's most wanted terrorists, was being followed by central security agencies for the last six months before he was apprehended in Nepal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X