అప్పుడే రాజీనామా చేయాల్సింది: సిఎంపై దామోదర

Kiran kumar Reddy and Damodara Rajanarsimha
నల్లగొండ: ముఖ్మయంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. అప్పుడే రాజీనామా చేయాల్సిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాాడరు.

అందరం మన మూలాలు గుర్తించుకొని వ్యవహరించాలని,ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్ష, ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం వ్యవహరించాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీఎం కిరణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004, 2009 ఎన్నికల్లో పార్టీ వాగ్దానం చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్పుడు సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం అయిన నేను కాంగ్రెస్ వాదులమేనని ఆయన అన్నారు.

తెలంగాణ ఏర్పాటుపై ఆరోజు లేని అభ్యంతరం ఈరోజు ఎందుకని, అభ్యంతరం ఉంటే ఆరోజే రాజీనామా చేసి బయటకు పోవాల్సిందని అని వ్యాఖ్యానించారు. ఆ రోజు మాత్రం తెలంగాణ ప్రజల ఓట్లు కావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రజలే కారా అని ఒక ప్రాంతం ప్రజలే ప్రజలా అని అని ప్రశ్నించారు.

ప్రాంతాలుగా మాత్రమే విడిపోవాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. రాగద్వేషాలకు తావు లేదని, భారతీయులందరికీ రాజ్యాంగం రక్షణ కల్పించిందని దామోదర అన్నారు. హైదరాబాద్‌లో నివసించే వారంతా హైదరాబాదీలేనని, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేననిఅని తెలిపారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వాగ్దానం చేసిందని, దాన్ని అమలు చేసేందుకే ఇప్పుడు ప్రకటన చేసిందని రాజనరసింహ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+