సమైక్య పోరు: ధర్మానకు చేదు అనుభవం, ఆగ్రహం

Dharmana Prasad Rao
శ్రీకాకుళం: మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు ధర్మాన ప్రసాద రావుకు శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళంలో చేదు అనుభవం ఎదురైంది. సమైక్యవాదులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దానికి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల రాజీనామాలు కోరవద్దని సీమాంధ్రవాదులకు ఆయన ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.

సమైక్య సమరనాదం పేరుతో శుక్రవారం శ్రీకాకుళంలో సీమాంధ్ర కార్యకర్తలు నిర్వహించిన సభకు హాజరైన ధర్మానకు సమైక్య సెగ తగిలింది. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ సభలో దర్మన ప్రసంగిస్తుండగా సమైక్య వాదులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దానికి ధర్మాన ప్రసాదరావు సీమాంధ్ర వాదులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు, ఎప్పుడు సమైక్య వాదినేనని ఆయన చెప్పారు. తనకు పదవిపై వ్యామోహం లేదని, తాను రాజీనామా ఎందుకు చేయలేదో వివరించారు. ప్రజాభీష్టాన్ని చట్టసభల్లో తెలియజేయడానికి అవకాశం ఉండాలని, అంతే తప్ప పదవిపై వ్యామోహం లేదని అన్నారు.

ఇప్పుడు రాజీనామా చేస్తే చట్టసభల్లో ఉండే అర్హత కోల్పోతామని, దానివల్ల సీమాంధ్ర ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేయమని కోరవద్దని ధర్మాన సీమాంధ్రవాదులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేందుకు ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామాలు చేయవద్దని, రాష్ట్ర సమైక్యత కోసం పోరాటం చేద్దామని ధర్మాన పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షను వ్యతిరేకించిన ఏ పార్టీ మనుగడ సాధించదని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+