కర్నూలు పౌరుషం చూపిస్తాం: కెఇ, రాయపాటి వ్యాఖ్య

ఏపీఎన్జీవోల సభను అడ్డుకుంటే కర్నూలు నుంచే ఉద్యమం ప్రారంభమవుతుందని, అడ్డుకున్న వారికి కర్నూలు పౌరుషం రుచి చూపించాల్సి వస్తుందని కెఇ హెచ్చరించారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కమ్మక్కై రాష్ట్ర విభజనపై నాటకాలు ఆడుతున్నాయని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజలు వారి కుతంత్రాలు తిప్పికొట్టాలని కోరారు.
రాష్ట్ర సమైక్యతపై స్పష్టమైన ప్రకటన రాకుంటే సీమాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కావడం తథ్యమని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. సీమాంద్రుల మనోభావాలకు అనుగుణంగా ఆ పార్టీని ప్రజలే నిర్మించి వారే నడిపిస్తారని చెప్పారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మూడు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదనను బలంగా వినిపి స్తున్నారన్నారు. వచ్చే నెల 6వ తేదీ తర్వాత సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications