వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేస్తే పడిపోతున్న జగన్: వారు చక్కర్లు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఉస్మానియా ఆస్పత్రి నుంచి నిజాం వైద్య విజ్ఝాన సంస్థ (నిమ్స్)కు తరలించే క్రమంలో ఆయన తల్లి వైయస్ విజయమ్మ, భార్య వైయస్ భారతి అక్కడికీ ఇక్కడికీ చక్కర్లు కొట్టారు. శుక్రవారం రాత్రి జగన్‌ను ఉస్మానియా ఆస్పత్రి నుంచి నిమ్స్‌కు తరలించారు. ఆయనను కలవడానికి అంతకు ముందు ఉస్మానియా వద్ద వైయస్ భారతి ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం కనిపించలేదు.

వైయస్ జగన్‌ను కలవడానికి వైయస్ భారతికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జగన్‌ను నిమ్స్‌కు తరలిస్తున్నారని తెలిసి, వైయస్ విజయమ్మ, భారతి అక్కడికి చేరుకున్నారు. ఉస్మానియా వద్ద సాధారణ రోగులు తీవ్రమైన ఇక్కట్ల పాలయ్యారు. జగన్‌ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో వారు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. వైయస్ జగన్ ఆరోగ్యం విషమించింది. లేచి నిలబడితే పడిపోతున్నారని అంటున్నారు.

వైయస్ జగన్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన నిమ్స్‌లో కూడా దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చికిత్సకు ఆయన నిరాకరిస్తున్నారని అంటున్నారు. శనివారం ఆయన దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. నిమ్స్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్‌కు సహాయంగా ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్ భారతి చేసుకున్న విజ్ఝప్తిపై సిబిఐ కోర్టు న్యాయమూర్తి శనివారం తన నిర్ణయాన్ని వెలువరించనున్నారు. నిమ్స్‌లో జగన్‌కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు డాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

నిమ్స్‌కు తరలింపు ఇలా..

నిమ్స్‌కు తరలింపు ఇలా..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను శుక్రవారం రాత్రి ఇలా ఉస్మానియా ఆస్పత్రి నుంచి నిమ్స్‌కు తరలించారు. భారీ భద్రత మధ్య ఆయనను తరలించారు.

చికిత్సకు జగన్ మొరాయింపు

చికిత్సకు జగన్ మొరాయింపు

నిమ్స్‌లో ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడానికి జగన్ నిరాకరిస్తున్నాడు. ఏడో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించింది. కీటోన్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు, బిపి, షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు.

భారతి, విజయమ్మ చక్కర్లు

భారతి, విజయమ్మ చక్కర్లు

ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ జగన్‌ను చూసేందుకు వైయస్ విజయమ్మ, భారతి వచ్చారు. అయితే, వారికి లోనికి వెళ్లడానికి వైద్యులు అనుమతించలేదు.

విజయమ్మ, భారతి తిప్పలు..

విజయమ్మ, భారతి తిప్పలు..

జగన్‌కు సహాయంగా ఉండడానికి తమకు అనుమతి ఇవ్వాలని పెట్టుకున్న మెమోను సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో తనకు అనుమతి ఇవ్వాలని భారతి న్యాయమూర్తికి వ్యక్తిగత విజ్ఝప్తి చేసుకున్నారు. దానిపై శనివారం నిర్ణయం వెలువడనుంది.

నిమ్స్‌కు భారతి, విజయమ్మ

నిమ్స్‌కు భారతి, విజయమ్మ

వైయస్ జగన్‌ను ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తరలిస్తున్నారని తెలుసుకుని వైయస్ భారతి, విజయమ్మ నిమ్స్‌కు వెళ్లారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.

ఉస్మానియాలో జగన్ ఇలా..

ఉస్మానియాలో జగన్ ఇలా..

ఉస్మానియాలో ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడానికి నిరాకరిస్తూ ఇలా పడకపై పడుకున్న జగన్ చిత్రాలను ఓ టీవీ చానెల్ ప్రసారం చేసింది. అలా ప్రసారం చేసిన చిత్రం ఇది..

భారీ బందోబస్తు..

భారీ బందోబస్తు..

జగన్ ఆస్పత్రిలో ఉన్నంత వరకు ఉస్మానియా వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో సామాన్య రోగులు, వారి బంధవులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. పోలీసులతో ఇలా మాట్లాడుతూ ఇలా..

ఇదేమి చోద్యం..

ఇదేమి చోద్యం..

ఉస్మానియా ఆస్పత్రిలో పేదలు, సామాన్యులు బహుశా ఇటువంటి పరిస్థితిని ఇంతకు ముందు చూసి ఉండరు. వారికి జగన్ వల్ల ఆస్పత్రిలోకి వెళ్లడానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి.

ట్రాఫిక్ ఇక్కట్లు...

ట్రాఫిక్ ఇక్కట్లు...

ఉస్మానియా ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ట్రాఫిక్‌కు ఆ ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి.

పిల్లలతో తల్లులు ఇలా..

పిల్లలతో తల్లులు ఇలా..

తమ పిల్లలను ఆస్పత్రికి తీసుకు వచ్చిన తల్లులు ఉస్మానియా ఆస్పత్రి వద్ద శుక్రవారం ఇలా బిత్తరపోయారు. వారికి తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయి. జగన్‌‍ను వేరే ఆస్పత్రికి తరలించడానికి ఉస్మానియా వైద్యులు దాన్ని కూడా ఓ కారణంగా చూపారు.

English summary
YSR Congress president YS Jagan is continuing fast in NIMS. YS Vijayamma and Bharatii are in tense on Jagan's health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X