అందిన ఆదేశాలు: బలవంతంగా జగన్ దీక్ష భగ్నం

హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్షను బలవంతంగా భగ్నం నిమ్స్ వైద్యులు భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులు పట్టుకుని ఆయనకు బలవంతంగా ఐబి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దాంతో జగన్ మత్తులోకి వెళ్లిపోయారు. జైలు అధికారుల నుంచి ఆదేశాలను, మార్గదర్శక సూత్రాలను అందుకుని జగన్ దీక్షను భగ్నం చేశారు. వైయస్ జగన్‌కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించనున్నట్లు నిమ్స్ వైద్యుడు నగేష్ అంతకు మీడియా ప్రతినిధులతో చెప్పారు.

జగన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, ఐబి ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ప్రమాదం సంభవిస్తుందని తాము జైలు అధికారులకు తెలిపామని, దాంతో 593 నిబంధనల ప్రకారం జగన్‌కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ఆదేశాలు వచ్చాయని ఆయన వివరించారు. దీక్షను భగ్నం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని ఆయన చెప్పారు.

YS Jagan and Doctors

వైయస్ జగన్ వైద్యానికి నిరాకరిస్తున్నారని, అందువల్ల బలవంతంగా వైద్యం అందించడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. బిపి, పల్స్ పడిపోతున్నాయని ఆయన చెప్పారు. అరగంటలోపే ఆయనకు బలవంతంగా ఐబి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని ఆయన చెప్పారు.

సమైక్యాంధ్ర కోరుతూ జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన గురువారం రాత్రి చంచల్‌గుడా జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి నిజాం వైద్య విజ్జాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. కోర్టు అనుమతి లభించడంతో వైయస్ భారతి తన భర్త వైయస్ జగన్ పక్కనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+