నిమ్స్‌కు వైయస్ జగన్ తరలింపు: భారీగా భద్రత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నుంచి శుక్రవారం రాత్రి నిజాం వైద్య విజ్ఝాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చంచల్‌గుడా జైలులో నిరాహార దీక్ష చేపట్టిన ఆయనను చికిత్స నిమిత్తం గురువారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన విషయం తెలసిందే.
వైయస్ జగన్‌ను నిమ్స్‌కు తరలించిన నేపథ్యంలో ఆయన తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, భార్య భారతి అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందు శుక్రవారం రాత్రి జగన్ వద్దకు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలని ఉస్మానియా ఆస్పత్రి వద్ద వైయస్ భారతి పోలీసులను కోరారు. అయితే వారు ఆమెకు అనుమతి నిరాకరంచారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించాలని ఆస్పత్రి వైద్యులు కోరారు. ఈ మేరకు ఉస్మానియా వైద్యుల కమిటీ జైళ్ల శాఖకు ఓ లేఖ రాసింది. జగన్‌కు వైద్యం ఆందించడానికి తమ వద్ద అత్యాధునిక సదుపాయాలు లేవని, అందువల్ల నిమ్స్ వంటి వేరే ఆస్పత్రికి తరలించాలని వారన్నారు.
దానికితోడు, ప్రతి రోజూ ఉస్మానియాకు అనేక మంది రోగులు వస్తారని, జగన్‌ను ఆస్పత్రిలో ఉంచడం వల్ల వైద్య సేవలకు అంతరాయం కలుగుతుందని వారన్నారు. వైయస్ జగన్ ఆరోగ్యం మరింత క్షీణించిందని, పరిస్థితి విషమిస్తే బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని వైద్యులు చెప్పారు. దీంతో జగన్‌ను ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications