టీని ఆపడం ఎవరి తరం కాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam kumar Reddy
నల్లగొండ: వచ్చే ఎన్నికలు ప్రత్యేక రాష్ట్రంలోనే జరుగుతాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి నల్గొండ జిల్లా నే రేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. సోనియా గాంధీ నాయకత్వంలో సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం యధాతథంగా అమలు జరుగుతుందన్నారు. విభజన ప్రక్రియ ఆపడం ఎవరి తరం కాదన్నారు.

అన్ని పార్టీల లిఖితపూర్వక అంగీకారం తర్వాతే సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని,ఈ సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టటం సరికాదని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం, సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలుగుదేశం, సిపిఐ, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు వంటి ప్రధాన పార్టీలన్నీ రాష్ట్ర విభజనకు తమకు అభ్యంతరం లేదని లిఖిత పూర్వకంగా రెండు సార్లు తెలిపాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం విభజన దిశగా చర్యలు తీసుకుందన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ స్పష్టం చేసినందున ఇక రాష్ట్ర ఏర్పాటు ఆగదని అన్నారు.

అన్ని పార్టీలతో పాటు కాంగ్రెస్‌లోని అందరి నాయకులు తెలంగాణకు అనుకూలంగా ఆమోదం తెలిపిన తర్వాతనే సీడబ్ల్యూసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు తిరిగి ఈ విషయమై రాద్ధాంతం చేయడం తగదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మెదక్‌జిల్లా నర్సాపూర్ వచ్చిన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

కాంగ్రెస్‌లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు కూడా తెలంగాణపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చి మాట్లాడటం తగదని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+