వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు: మైనర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో మైనర్ నిందితుడు దోషిగా తేలాడు. అత్యాచారం, హత్య అభియోగాల్లో అతన్ని కోర్టు దోషిగా తేల్చింది. వైద్య విద్యార్థినిపై కదులుతున్న బస్సులో అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అతనిపై కేసును బాలనేరస్థుల కోర్టు విచారించింది.

మూడేళ్ల పాటు అతన్ని రిఫార్మ్ సెంటర్‌కు పంపుతూ కోర్టు తీర్పు వెలువరించింది. నేరం జరిగినప్పుడు అతనికి 17 ఏళ్లున్నాయి. దాంతో మిగతా నిందితుల నుంచి అతన్ని వేరు చేసి జువెనైల్ కోర్టు విచారణ జరిపింది.

Delhi gang rape Junenile

నిరుడు డిసెంబర్ 16వ తేదీన ఓ వైద్య విద్యార్థినిపై బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులోని ఆరుగురు నిందితుల్లో మైనర్ నిందితుడిపై బాలనేరస్థుల కోర్టు శనివారం తీర్పు వెలువరించింది.

వైద్య విద్యార్థిని తన మగ మిత్రుడితో కలిసి వెళ్తుండగా అత్యాచారానికి గురైంది. మిత్రుడిని తీవ్రంగా కొట్టి ఆరుగురు వ్యక్తులు ఆమెపై బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డారు.

English summary
Juvenile found guilty of rape and murder in Delhi gang rape case. A para medical girls student has been raped in a moving bus in Delhi on december 16 last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X