అవే చేతుల్తో దిమ్మెలు కూల్చేయండి: జగన్‌పై హరీష్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణ అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇప్పటికీ పోలీసులు తెలంగాణ ఉద్యమకారులను కేసుల పేరిట వేధిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. ఈ నెల 7వ తేదీన తమ ర్యాలీకి ప్రభుత్వం అనుమతిచ్చినా ఇవ్వకున్నా తాము భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్ర ఉద్యమం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిల ఆధ్వర్యంలో జరుగుతోందని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. తనకు కేంద్రమంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో వచ్చి చేరానన్నారు. జై తెలంగాణ అని నినాదాలు చేస్తున్న వారిని కొందరు మంత్రులు జైల్లో పెట్టిస్తున్నారని ఆరోపించారు.
కోర్టుకెళ్తాం: ఎపిఎన్జీవో
తమకు ఈ నెల 7వ ఎల్బీ స్టేడియంలో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే తాము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని ఎపిఎన్జీవోలు తెలిపారు. తమ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలంగాణ ఉద్యోగుల పైన అలాంటి చర్యలే తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications