ముంబై రేప్: ముగ్గురు నిందితులు పోర్న్ చూసేవారు
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు తరుచుగా అక్రమ వీడియో పార్లర్స్‌లో అశ్లీల చిత్రాలు చూసేవారని తెలుస్తోంది. మదన్‌పురా, బైకుల్లా, అగ్రిపదల్లోని రెడ్ లైట్ ఏరియాకు కూడా వెళ్తుండేవారని పోలీసులు చెబుతున్నారు.
తాము పోర్న్ చూసేందుకు వెళ్తుండేవాళ్లమని నిందితులు విజయ్ జాదవ్, కాసిం బెంగాలీ, మైనర్ తమకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిజానికి విజయ్ జాదవ్ పార్లర్‌లో నిద్రిస్తూ పోలీసులకు చిక్కాడు. ముంబైలోని మురికివాడల్లో ఈ అశ్లీల చిత్రాల ప్రదర్శన ఏ విధంగా జరుగుతోందో ఈ సంఘటన ద్వారా వెల్లవడవుతోందని అంటున్నారు.

అగ్రిపదలో దాదాపు నాలుగు డజన్ల అక్రమ పార్లర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రోజుకు ఎనిమిది నుంచి పది చిత్రాలను వేస్తారని అంటున్నారు. దాదాపు 50 నుంచి 80 మంది కూర్చుని వాటిని చూడడానికి వీలుంటుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక్కో వ్యక్తి నుంచి 15 నుంచి 20 రూపాయల వరకు వసూల చేస్తారని ఆ వార్తలను బట్టి తెలుస్తోంది.
నిర్మానుష్య ప్రదేశాలను గుర్తించి, తగిన భద్రత ఉండేలా చూడాలని పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ గతవారం ఆదేశాలు జారీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రదేశాలకు సంబంధించి వాటి యజమానులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. డెన్‌లపై దాడులు చేసిన 55 మంది డ్రగ్స్‌కు అలవాటుపడినవారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications