Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిల్లు పెట్టకుంటే రామభక్తుల ప్రభుత్వం: అశోక్ సింఘాల్

హైదరాబాద్: పార్లమెంటు సమావేశాల్లో రామ మందిర నిర్మాణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింప చేయాలని లేదంటే రామ భక్తుల ప్రభుత్ం ఏర్పాటు చేసుకొని అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకుంటామని విశ్వహిందు పరిషత్ నేత అశోక్ సింఘాల్ ఆదివారం అన్నారు. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిజాం కళాశాల మైదానంలో గణేష్ మండప నిర్వాహకుల సభ జరిగింది.

దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినప్పటికీ ధార్మికంగా, సంస్కృతి పరంగా హిందువులు ఇంకా బానిసలుగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పివి నర్సింహా రావు ప్రధానిగా లేకపోయుంటే బాబ్రీ మసీదు కూల్చివేత సాధ్యమయ్యేది కాదని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ స్వామిజీ స్వామి చిన్మయానంద అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా రామ జన్మభూమి అయోధ్యలో ర్యాలీలు నిర్వహించుకోవడానికి కూడా హిందువులకు హక్కు లేదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

VHP demands bill in parliament on Ram Mandir

స్వాతంత్య్రం వచ్చినా కూడా దేశం ఇంకా ఆంగ్లేయుల పాలనలోనే ఉందని ఆయన సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. చిన్మయానంద మాట్లాడుతూ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పమనండి, మా బజరంగ్‌దళ్ కార్యకర్తలను పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. కమలానంద భారతి మాట్లాడుతూ యుగాలు మారినా, అవతారాలు మారిన హిందూ సంస్కృతి మారదని చెప్పారు.

హిందువులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే హిందువులకు శ్మశాన వాటికల కోసం ప్రతీ గ్రామంలో ప్రభుత్వం భూమినివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మత మార్పిడీల వల్ల హిందూ సంస్కృతి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిపూర్ణానంద స్వామిజీ మాట్లాడుతూ హిందూ మతంపై, సంస్కృతిపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయన్నారు. వాటిని అరికట్టడానికి హిందూ జాతి జాగృతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సెక్యూలరిజం పేరిట మైనారిటీ వర్గాలను చేరదీయడం ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పారు. ప్రజలను మతాలుగా, వర్గాలుగా విభజించి పాలించే విధానాలకు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్వస్తిపలకాలని ఆయన చురకలంటించారు. దేశానికి ప్రస్తుతం వినాయకుడి లాంటి బుద్ధివంతుడైనా నాయకుడు అవసరమని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+