వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మకం కోల్పోయాం ఐనా ప్రయత్నం: సమైక్యంపై సిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
హైదరాబాద్: ఆంటోని కమిటీని కలిసి వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంపై నమ్మకం పోయిందని దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య మంగళవారం అన్నారు. అయినా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ ప్రయత్నాలు తాము చేస్తామన్నారు. విభజనకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ పొరపాటు నిర్ణయం తీసుకుందన్నారు.

విభజనపై కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం ముందుకు, వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్లో ఉందని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. సిడబ్ల్యూసి తన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎపిఎన్జీవోల సభకు తాము మద్దతిస్తున్నామన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, సమైక్యంగా ఉంచడమే తాము ధ్యేయమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ జై సమైక్యాంధ్ర అనడం లేదన్నారు. వినాయక చవితి అనంతరం అసెంబ్లీ వద్ద 48 గంటల దీక్ష చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదుట చేసిన దీక్ష ఒకటి గంటలకు పూర్తయింది. అనంతరం వారు మాట్లాడారు.

సురేష్ జల ఘోష

సమైక్యాంధ్రకు మద్దతుగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ ఆధ్వర్యంలో కర్నూలులో జలఘోష పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు వరకు పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు సీమాంద్రుల సొత్తు అని, దీనిపై కన్నేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

English summary
Minister C Ramachandraiah on Tuesday said that we lost out hope on Samaikyandhra after meeting with AK Antony Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X