దానం ఇంటి వద్ద పోస్టర్స్ కలకలం, జీతాలపై హరికృష్ణ

Nandamuri Harikrishna
హైదరాబాద్/న్యూఢిల్లీ: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ఇంటి వద్ద మంగళవారం పోస్టర్లు కలకలం రేపాయి. హైదరాబాదులోని దానం ఇంటి వద్ద బిసి జెఏసి, ఓయు జెఏసి పేరుతో పోస్టర్లు వెలిశాయి. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే అల్లకల్లోలమేనని పోస్టర్లలో పేర్కొన్నారు.

సభకు అనుమతివ్వాలి: హరికృష్ణ

ఈ నెల 7వ తేదిన హైదరాబాదులో ఎపిఎన్జీవోలు తలపెట్టిన సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆయన అన్నారు.

అనంతలో సింహ గర్జన

సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అనంతపురంలో ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అనంత సింహ గర్జన ఉదయం ప్రారంభమైంది. ఈ గర్జనకు వేలాది మంది సమైక్యవాదులు, విద్యార్థులు తరలి వచ్చారు. అనంతపురం పట్టణం జనసంద్రంగా మారింది.

35 రోజులుగా ఉద్యమం శాంతియుతంగా చేస్తున్నామని, ఇకముందు అదే దారిలో వెళతామని, ఎలా ఉద్యమాన్ని కొనసాగించాలనే విషయమై ఈ సభలో నిర్ణయం తీసుకోనున్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల్లో సమైక్యవాదాన్ని చాటి చెప్పాలనేది తమ ఉద్దేశ్యమని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+