హైదరాబాద్ కేంద్రంగా..: శైలజానాథ్, అసెంబ్లీ వద్ద దీక్ష

ఈ దీక్షలో పన్నెండు మంది మంత్రులు, 39 మంది ఎమ్మెల్యేలు, పది మంది శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒకటి గంటల వరకు వారి దీక్ష కొనసాగుతుంది. కాగా, ఈ దీక్షను నిరవధిక దీక్షగా మార్చాలని ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
శైలజానాథ్ మాట్లాడుతూ.. పదవుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల వెంట ఉండి పోరాడుతామన్నారు. సమైక్యాంధ్ర ప్రజా ఉద్యమాలకు సంఘీభావంగా నిరసన దీక్ష చేపట్టినట్లు చెప్పారు. విభజనపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చివరి క్షణం వరకు అధిష్టానంతో పోరాడుతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
కాగా, సీమాంధ్ర కాంగ్రెసు నేతల దీక్ష నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. వందలాది మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications