బొత్సకు విద్యార్థుల నిలదీత: సమైక్యవాదినే కానీ..

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను సమైక్యవాదులు మంగళవారం నిలదీశారు. ఢిల్లీలో బొత్స విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా పలువురు విద్యార్థులు విజయనగరంలో దాడి జరిగిందని, దానికి క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. దానికి బొత్స... తనకు దాడి జరిగిన విషయం తెలియదని, అదే నిజమైతే తాను దానిని ఖండిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, బొత్స మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

విజయనగరంలో జరిగిన దాడికి బొత్స క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. బొత్స మాత్రం తనకు తెలియదని, విషయం తెలుసుకున్న తర్వాత స్పందిస్తానన్నారు. అయినా వారు పట్టు వీడకపోవడంతో దాడి జరిగితే మాత్రం ఖండిస్తున్నట్లు చెప్పారు.

సమైక్యవాదినే కానీ..

సీమాంధ్ర ప్రజల మనోభావాల నేపథ్యంలో తాను సమైక్యవాదినేనని అయితే, తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను తాను అధిష్టానానికి చెబుతానని, అంతిమంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అభిప్రాయపడ్డారు. విభజనపై తాను రెండు మాటలు మాట్లాడటం లేదన్నారు.

మరోవైపు విజయనగరంలో విద్యార్థులపై జరిగిన దాడిని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. సమైక్యాంధ్రలో పాల్గొన్న విద్యార్థులపై విజయనగరంలో జరిగిన దాడిని నిరసిస్తూ మయూరి ఫంక్షన్ హాల్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+