దూషణ: ఢిల్లీ సిఎం తనయుడిపై నామా హక్కుల నోటీసు

కాగా, పార్లమెంటు సాక్షిగా సందీప్ దీక్షిత్ తమను హెచ్చరించినట్లుగా శివ ప్రసాద్ ఆరోపించారు. కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి శివ ప్రసాద్ మీదికి వెళ్లబోయారట. అయితే, సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఇతర ఎంపీలు వారిని అడ్డుకున్నారు. ఇందిరా గాంధీ మాస్కు ధరించిన శివప్రసాద్ సభకు వచ్చి.. రాష్ట్ర సమైక్యతపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.
దీంతో ఒకరిపై మరొకరు స్పీకర్ మీరా కుమార్‌కు ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు సందీప్ దీక్షిత్, మధుయాష్కీ గౌడ్ సభ గౌరవాన్ని మంటగలిపారని, పార్లమెంటు హుందాతనానికి సంబంధించిన అన్ని హద్దులనూ అతిక్రమించారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సభ వాయిదా పడింది. విభజనపై నిరసనలు ఆగకపోవడంతో 11.06 గంటలకు స్పీకర్ 9 మంది పేర్లను చదివి వారిని సభ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. సభ వాయిదా పడిన వెంటనే ఉదయం 11.15 గంటలకు సందీప్ దీక్షిత్, మధుయాష్కీ, టిడిపి ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. పార్లమెంట్ నుంచి బయటకు రా, ఢిల్లీలోనే నిన్ను చంపేస్తానని శివప్రసాద్‌ను ఉద్దేశించి సందీప్ దీక్షిత్ అన్నారట.












Click it and Unblock the Notifications