కిరణ్ బుద్ధిమంతుడనుకున్నా: విహెచ్, యుటిపై ఈటెల

అందరి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకనే కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అక్కడి ప్రజలను రెచ్చగొట్టవద్దని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కిరణ్ వన్ సైడ్‌గా మాట్లాడటం సరికాదన్నారు. ఇలా మాట్లాడటం తాను మొదటిసారి చూస్తున్నానని చెప్పారు. తమకు ఎవరు అన్యాయం చేస్తున్నారో సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని సూచించారు.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. సీమాంధ్ర ఆందోళనలో చిన్న పిల్లల్ని పాల్గొనేలా చేయడమేమిటన్నారు. రాయలసీమ ప్రజలకు తాను చేతులెత్తి చెబుతున్నానని... తాము ఇప్పటికే నష్టపోయామని, మీరు కూడా నష్టపోవద్దన్నారు.
రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందామన్నారు. తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని చంద్రబాబు గతంలో అన్నారని చెప్పారు. తెలంగాణకు గతంలో అనుకూలమని ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం ద్వారా ఎవరు తమను మోసం చేస్తున్నారో సీమాంధ్ర ప్రజలు గుర్తించాలన్నారు.
రెచ్చగొట్టే చర్య: కెకె
హైదరాబాదులో ఎపిఎన్జీవోలు సభ పెట్టడం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమేనని తెరాస నేత కె కేశవ రావు అన్నారు. ఆయన ఈ రోజు మంత్రి జానా రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదులో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య విద్వేషాలు జరక్కుండా చూసుకోవాలని కోరారు.
యూటి చేస్తే ఊరుకోం: ఈటెల
హైదరాబాదును యూటి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. విడిపోతేనే రెండు రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొందరు రాజకీయ నాయకులది, వ్యాపారులదే అన్నారు. సమైక్యాంధ్ర సీమాంధ్ర ప్రజల డిమాండ్ కాదన్నారు. తెలంగాణ ప్రజల కళ్లలో సమైక్యాంధ్ర అంటూ కారం కొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు.












Click it and Unblock the Notifications