షర్మిలకోసం ఆతృత: ఆమె హాయ్, వారి బాయ్(పిక్చర్స్)
చిత్తూరు: సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం షర్మిల యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రాంతాల్లో మాట్లాడారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం బీడువారుతుందన్నారు.
ప్రశాంతంగా జీవిస్తున్న తెలుగు జాతి మధ్య విభేదాలు సృష్టించి అన్నదమ్ముల మధ్య కాంగ్రెసు పార్టీ అగ్గిపెట్టి చలి కాచుకుంటోందని, తెలుగు వారి భిక్షతో కేంద్రం గద్దెనక్కి వారి కళ్లనే పొడుస్తోందని ఆరోపించారు. షర్మిల తన యాత్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు.
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెసు పార్టీ అడ్డగోలుగా విభజనకు పూనుకుందని, అసలు విభజనకు మూల కారణం చంద్రబాబేనని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టిడిపి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబు, టిడిపి నేతలు రాజీనామా చేయాలని, సమైక్యాంధ్రకు కేవలం తమ పార్టీతో పాటు సిపిఎం, మజ్లిస్‌లు మాత్రమే అనుకూలంగా ఉన్నాయన్నారు.

హాయ్
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

షేక్ హ్యాండ్
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలతో చేతులు కలిపేందుకు అభిమానుల ఆరాటం.

బాయ్ బాయ్
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలకు టాటా చెబుతున్న అభిమానులు, కార్యకర్తలు.

జన సందోహం
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సభకు విచ్చేసిన జన సందోహం.

జన సందోహం 2
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సభకు విచ్చేసిన జన సందోహం. మాట్లాడుతున్న షర్మిల.

జన సందోహం 3
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సభకు విచ్చేసిన జన సందోహం. జనాల మధ్య షర్మిల బస్సు.












Click it and Unblock the Notifications