కోర్టులో ఎదురు దెబ్బ: జైల్లోనే ఆశారాం బాపు
జోథ్‌పూర్: బాలికపై ఆత్యాచారం కేసులో ఆశారాం బాపుకు జోధ్‌పూర్ (రూరల్) కోర్టులో బుధవారం ఎదురు దెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆశారాం బాపు మరింత కాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనను కోర్టు సెప్టెంబర్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని ఆశారాం బాపు బెయిల్ పిటిషన్‌ను అంతకు ముందు ప్రాసిక్యూషన్ కోర్టులో వ్యతిరేకించింది. పోలీసులను కూడా ప్రభావితం చేయడానికి ఆశారాం ప్రయత్నించారని, బెయిల్ ఇస్తే ఆయన కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వాదించింది.

ఎఫ్ఐఆర్‌లో పేర్లున్న ఛింద్వారా గురుకుల్ హాస్టల్ వార్డెన్ శిల్పి, గురుకుల్ కేర్ టేకర్ శరద్ పరారీలో ఉన్నారని, దర్యాప్తును పూర్తి చేయడానికి వారిద్దరిని విచారించడం అవసరమని అదనపు అడ్వొకేట్ జనరల్ ఆనంద్ పురోహిత్ కోర్టుకు తెలిపారు.
విచారణ అనంతరం కోర్టు ఆశారాం బాపు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసింది. బుధవారం సాయంత్రం ఆశారాం బాపు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications