షర్మిలకు చేదు అనుభవం: మేకపాటిని తిప్పి పంపేశారు

అనంతపురం జిల్లాలోని పామిడికి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర చేరుకున్నప్పుడు పలువురు సమైక్యవాదులు షర్మిల గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. దీంతో ఆమె మరోమార్గంలో కర్నూలు వెళ్లారు. మరోవైపు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ నేత, ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురయింది.
నెల్లూరులోని సింహ గర్జనకు వచ్చిన మేకపాటిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. సింహ గర్జనలో రాజకీయ నాయకులకు అనుమతి లేదంటూ సమైక్యవాదులు ఆయనను వెనక్కి తిప్పి పంపించారు.
సమైక్యాంధ్ర కోసం కడప జిల్లా ప్రొద్దుటూరులో లక్షన్నర మందితో పోలికేక, నెల్లూరు జిల్లాలో సమైక్య సింహగర్జన, ఏలూరులో సమైక్య శంఖారావ, చిత్తూరు జిల్లా కుప్పంలో లక్ష గళ ఘోష, అనంతపురం జిల్లా తాడిపత్రిలో సమైక్య జన ఘోష, తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సమైక్య సాగర ఘోష, గుంటూరు జిల్లా తెనాలిలో లక్ష గళ ఘోషలు నిర్వహిస్తున్నారు.
హైకోర్టులో పిటిషన్
ఈ నెల 7వ తేదిన హైదరాబాదులో జరగనున్న ఎపిఎన్జీవోల సభపై తెలంగాణ ఉద్యోగుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సభను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. శుక్రవారం ఇది విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications