బాబు రెండు కళ్లూ పోతాయి: గుత్తా, ఉండవల్లిపై పొన్నం

gutta sukhender reddy
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే రెండు కళ్లూ కోల్పోవడం ఖాయమని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో సీమాంధ్రలో యాత్రను ప్రారంభించారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రలో ఎలా యాత్ర చేస్తారని ఆయన అడిగారు.

తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర పేరుతో చంద్రబాబు సీమాంధ్ర ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయినట్లున్నారని గుత్తా వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రుల ఉద్యమం సరైందేనని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు.

సోనియాకు వ్యతిరేకంగా ఉండవల్లి జ్ఝానం

తమ పార్టీ రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు తన జ్ఝానాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందిరా గాంధీ గురించి ఎప్పుడూ చెప్పే ఉండవల్లి తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఇందిరా మాస్క్ ధరించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన అడిగారు. రాష్ట్ర విభజన జరగదని చేసిన ఉండవల్లి ప్రకటనపై ఆయన మండిపడ్డారు.

సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమాన్ని ఉండవల్లి సభలో ప్రస్తావించినప్పుడు తెలంగాణ పార్లమెంటు సభ్యులు అడ్డుకున్నారు. తన ప్రసంగంలో ఉండవల్లి ముల్కీ నిబంధనలను ప్రస్తావించడంపై వారు అభ్యంతరం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+