విభజనలో కిరణ్ భాగం: డిఎస్, మాపై దాడే: మందకృష్ణ

D Srinivas
హైదరాబాద్/న్యూఢిల్లీ: విభజన నిర్ణయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓ భాగమేనని, అలాంటిది ఆయన అడ్డుకుంటారని తాము భావించడం లేదని పిసిసి మాజీ అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ గురువారం విజ్ఞప్తి చేశారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయాలన్నారు. ఇరు వర్గాల మధ్య రాగద్వేషాలు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు.

అన్ని వర్గాలను సంప్రదించాకే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎపిఎన్జీవోలు ఈ నెల 7వ తేదిన నిర్వహించే సభలో తమ సమస్యలు చెప్పుకోవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే ప్రయత్నం ఎవరు చేయవద్దని కోరారు. సభలు, ర్యాలీలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే జరుగుతాయన్నారు. హైదరాబాదును యుటిగా చేస్తారనేది అవాస్తవమన్నారు.

సంయమనం పాటించండి: జానా రెడ్డి

ఈ నెల 7వ తేదిన జరిగే ఎపిఎన్జీవోల సభ పట్ల తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని మంత్రి జానా రెడ్డి ఢిల్లీలో విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆయన ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడారు. సిడబ్ల్యూసి తీర్మానం ప్రకారమే హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర విభజనలో సమన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు.

శాంతిగా సభ జరుపుకోండి: పోలీసులు

ఎపిఎన్జీవోలు సభను ఎల్బీ స్టేడియంలో సభను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. ఏ చిన్న తేడా వచ్చినా సభను రద్దు చేస్తామన్నారు. తెలంగాణ శాంతి ర్యాలీలు, సభలకు కూడా తాము అనుమతిస్తామని, సభ నిర్వహిస్తామంటే వారికి 8వ తేదిన అనుమతిస్తామన్నారు. ర్యాలీలకు మాత్రం అనుమతి లేదన్నారు.

తెలంగాణపై దాడిగానే భావిస్తున్నాం: మందకృష్ణ

ఎపిఎన్జీవోల సభను తాము తెలంగాణపై దాడిగానే భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం హైదరాబాదులో అన్నారు. సభకు అనుమతిస్తే తాము సీమాంధ్ర నుండి వచ్చే ప్రయివేటు బస్సులను అడ్డుకుంటామన్నారు. ఎల్పీ స్టేడియం వద్ద నిరసనలు చేపడతామన్నారు.

ఎపిఎన్జీవో సభపై హైకోర్టులో పిటిషన్

ఎపిఎన్జీవోల సభపై ప్రముఖ లాయర్ శ్రీరంగ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభ చట్ట విరుద్దమని కోర్టుకు తెలిపారు. రాజకీయ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎపిఎన్జీవోలు సభను ఎలా నిర్వహిస్తారని, ఇది చట్ట విరుద్దమన్నారు. ప్రతివాదులుగా డిజిపి, సిఎస్, ఎపిఎన్జీవో అధ్యక్షుడిని చేర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+