కేంద్రాన్ని కూలుద్దాం, రండి: విభజనపై పయ్యావుల

Payyavula Keshav
అనంతపురం/ హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూలుద్దామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. యుపిఎ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడేయవచ్చునని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం శాసనసభకు వస్తుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ రెండు సార్లు చెప్పారని, అందువల్ల శాసనసభలో తీర్మానాన్ని ఓడించడానికి సీమాంధ్ర శాసనసభ్యులు ఒక్కటి కావాలని ఆయన అన్నారు.

ఎపిఎన్జీవోలు ఈ నెల 7వ తేదీన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు వెళ్దామని కూడా సూచించారు. ఏ చట్టాలు, నిబంధనలు కూడా తమను సభకు వెళ్లకుండా అడ్డుకోలేవని ఆయన అన్నారు. కేంద్రం మోసంలో చిక్కుకోకుండా ప్రజల పక్షాన నిలుద్దామని ఆయన సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కోరారు.

ముఖ్యమంత్రి లేరు..

సమైక్యాంధ్ర ఉద్యమం వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని అనడం నిజం కాదని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్రం ఆలోచనలో పడిందని ఆయన గురువారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ అంశం అసెంబ్లీలో తీర్మానానికి వచ్చినప్పుడు సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని తాము తెలియజేస్తామని పితాని చెప్పారు. ఎపి ఎన్జీవోల సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు అనడం సమంజసం కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+