వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాని వెనుక కిరణ్ లేరు: పితాని, జగన్ పార్టీపై రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pitani Satyanarayana
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారనేది అవాస్తవమని మంత్రి పితాని సత్యనారాయణ గురురువారం అన్నారు. సీమాంధ్రలో 37 రోజులుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసి కేంద్రం, కాంగ్రెసు పార్టీ పునరాలోచనలో పడిందని చెప్పారు. తెలంగాణ అంశం అసెంబ్లీలో తీర్మానానికి వచ్చినప్పుడు సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని తాము తెలియజేస్తామన్నారు. ఎపిఎన్జీవోల సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు చెప్పడం సరికాదన్నారు.

కాంగ్రెస్ చేతిలో జగన్ పార్టీ పగ్గాలు: రేవంత్

కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పగ్గాలు ఉన్నాయని, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు ఆ పార్టీ ఆడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

సిడబ్ల్యూసి నిర్ణయానికి ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయించిందని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర కోసం హోంమంత్రికి ఆ పార్టీ లేఖ రాయాలని కాంగ్రెస్ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారముందని, ఒకట్రెండు రోజుల్లో ఆ పార్టీ లేఖ రాయనుందని ఆయన అన్నారు. ఇది వాస్తవమా...కాదా చెప్పాలని ప్రశ్నించారు.

శాంతిర్యాలీ నిర్వహించి తీరుతాం: కోదండరామ్

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈనెల 7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. ప్రభుత్వమే సీమాంధ్రలో ఉద్యమాన్ని చేయిస్తోందని ఆయన మండిపడ్డారు.

English summary
Minister Pitani Satyanarayana on Thursday responded 
 
 on allegations that CM Kiran Kumar Reddy behind 
 
 Samaikyandhra agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X