వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిండే ఇంటికి క్యూ: టిపై కోమటిరెడ్డి-అనంత వాగ్వాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: సిడబ్ల్యూసి రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వద్దకు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరు ప్రాంత నేతలు క్యూ కట్టారు. బుధవారం షిండే జన్మదినం. దీంతో ఆయన ఇల్లు రాష్ట్ర నేతలతో కిటకిటలాడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు మంత్రులు, నేతలు ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్సా సత్యారాయణ, ఎంపిలు కెవిపి రామచందర్ రావు, సుబ్బి రామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి ఆ తర్వాత వెళ్లి ఆయనను కలుసుకున్నారు. టిటిడి చైర్మన్ బాపిరాజు సతీసమేతంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఫోన్‌లో శుబాకాంక్షలు తెలుపగా, తెలంగాణ నేతలు బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, వివేక్, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి షిండేను కలిసి అభినందించారు. తెలుగుదేశం ఎంపీ సిఎం రమేశ్ తదితరులు కూడా షిండేకు అభినందనలు తెలిపారు.

కోమటిరెడ్డి - అనంత వాగ్వాదం

బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. ముఖాముఖి ఎదురుపడిన సమయంలో వీరి మధ్య విభజనపై వాడివేడి చర్చ నడిచింది. తొలుత కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం చర్చలు జరిపిన తర్వాత ఒకే దెబ్బకు తాము ఆరు పక్షులను కొట్టామని అన్నారు.

60 ఏళ్లుగా పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి కాంగ్రెస్ విశ్వసనీయతను నిరూపించుకోవడం, బిజెపి తెలంగాణలో పుంజుకోకుండా అడ్డుకోవడం, జగన్ ప్రభావాన్ని తెలంగాణలో లేకుండా చేయడం, చంద్రబాబును దెబ్బతీయడం, రానున్న ఎన్నికల్లో కనీసం 15లోక్‌సభ స్థానాలను సాధించడం.. అన్న ఆరు లక్ష్యాలను ఒకే నిర్ణయంతో సాధిస్తామని ఆయన అనంత వెంకటరామిరెడ్డికి వివరించారు.

దీనికి అనంత ఒకే దెబ్బకు ఆరుపక్షులను కొట్టాలనుకుంటున్నారా? మేము కూడా పక్షులమని మీ ఉద్దేశ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం లేని భార్యతో మీరెన్నాళ్లు కాపురం చేస్తారు? అని కోమటిరెడ్డి అన్నప్పుడు అత్యంత సీరియస్ అంశాన్ని భార్యాభర్తల తగాదాగా మార్చవద్దని అనంత అన్నారు. వారి మధ్య వాగ్వాదం పెరగడంతో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ జోక్యం చేసుకొని అన్నదమ్ముల్లా విడిపోదామని చెప్పారు.

English summary

 Political leaders from Andhra Pradesh greeted Central Home Minister Sushil Kumar Shinde on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X