వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షరతులు: ఎపిఎన్జీవో సేవ్ ఎపి సభకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court green signal to AP NGOs meeting
హైదరాబాద్: ఎపిఎన్జీవోల సభకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం అనుమతించింది. ఎపిఎన్జీవోలు ఈ నెల 7వ తేదిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

విచారణ అనంతరం కోర్టు సభకు అనుమతి ఇచ్చింది. సభ ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఎపిఎన్జీవోలదే బాధ్యత అని స్పష్టం చేసింది. ఉద్యోగులు కాని వారిని సభకు రానీయవద్దని సూచించింది.

సభ ప్రత్యక్ష ప్రసారంపై పిటిషన్ కొట్టివేత

ఎపిఎన్జీవోల సభను టివిల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించకూడదంటూ శుక్రవారం తెలంగాణ న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. తమ అభ్యంతరాలను నగర డిసిపికి తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది.

అశోక్ బాబు హర్షం

హైకోర్టు తమ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు అనుమతించడంపై ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సభను విజయవంతం చేస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగులు ర్యాలీలు, గుంపులుగా రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులకు అనుమతిలేనందున వారు బయటి నుంచి మద్దతు తెలపాలన్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన డిసిపి

ఎపిఎన్జీవో నేతలతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సెంట్రల్ జోన్ డిసిపి కమలాకర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.

డిగ్గీకి సీమాంధ్ర ఎంపీల లేఖ

ఎపిఎన్జీవోల సభకు కొన్ని అసాంఘిక శక్తులు అడ్డుపడుతున్నాయని సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు లేఖ రాశారు.

English summary
The High Court of AP gave green signal to APNGOs Save Andhra Pradesh meeting, which will held in LB Stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X