గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్య నిరసనలో జాతీయ పతాకం, గోమాత(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిడబ్ల్యూసి, యూపిఏ విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. ఆయా జిల్లాల్లో సమైక్యవాదులు మానవహారాలు, రోడ్ల పైనే వంటా వార్పు నిర్వహిస్తున్నారు. రాస్తారోకోలు, రోడ్ల పైనే దీక్షలు చేస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖమంటూ హోమాలు నిర్వహిస్తున్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో పలు జిల్లాల్లో గత నెల 12వ తేది అర్ధరాత్రి నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికుల సమ్మె కారణంగా జిల్లాల్లో ఆర్టీసి భారీ నష్టం చవిచూడాల్సి వస్తోంది. పలు సంఘాలు తమ తమ ఆందోళనలను, రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నాయి.

ఈ నెల 7వ తేదిన హైదరాబాదులో జరిగే సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఎపిఎన్జీవోలు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి రాజీనామా చేయనందున చెర్రీ తుఫాన్ సినిమాను పలుచోట్ల అడ్డుకున్నారు. పోస్టర్లు దగ్ధం చేశారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

గ్రేటర్ విశాఖ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు.

కెసిఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ

కెసిఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మకు పాదాచారుల సంఘం చెప్పుల దండ వేసి నిరసన తెలిపుతున్న దృశ్యం.

క్లాత్ మర్చంట్

క్లాత్ మర్చంట్

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో పోలీస్ బెరాక్స్ క్లాత్ మర్చండ్ వెల్ ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం.

ఊరేగింపు

ఊరేగింపు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టి బొమ్మను సమైక్యాంధ్రకు మద్దతుగా ఊరేగిస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

ఆటతో నిరసన

ఆటతో నిరసన

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆటలు ఆడుతూ నిరసన తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు.

జాతీయ పతాకంతో ర్యాలీ

జాతీయ పతాకంతో ర్యాలీ

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ జిల్లా పెందుర్తిలో ఉపాధ్యాయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ర్యాలీ తీస్తున్న దృశ్యం.

ఉపాధ్యాయుల ర్యాలీ

ఉపాధ్యాయుల ర్యాలీ

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ జిల్లా పెందుర్తిలో ఉపాధ్యాయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ర్యాలీ తీస్తున్న దృశ్యం.

మానవహారం

మానవహారం

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలోని జగదాంబ సెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించిన దృశ్యం. నగరంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆసనాలు వేస్తూ...

ఆసనాలు వేస్తూ...

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలోని జగదాంబ సెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించిన అనంతరం ఆసనాలు వేసి నిరసన తెలుపుతున్న దృశ్యం.

నిరాహార దీక్ష

నిరాహార దీక్ష

సమైక్యాంధ్ర కోరుతూ చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రయివేటు పాఠశాలల సిబ్బంది, యాజమాన్యాల నిరాహార దీక్ష, వంటా - వార్పు దృశ్యం.

తిరుపతి

తిరుపతి

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రయివేటు పాఠశాలల సిబ్బంది, యాజమాన్యాల నిరాహార దీక్షలో పాల్గొన్న సమైక్యవాదులు.

కోలాటం

కోలాటం

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రయివేటు పాఠశాలల సిబ్బంది, యాజమాన్యాల నిరాహార దీక్షలో పాల్గొన్న సమైక్యవాదులు కోలాటంతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

ప్రయివేటు పాఠశాలల సిబ్బంది, యాజమాన్యాల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆట-పాట, వంటా-వార్పులో పాల్గొన్న దృశ్యం.

కోలాటం

కోలాటం

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రయివేటు పాఠశాలల సిబ్బంది, యాజమాన్యాల నిరాహార దీక్షలో పాల్గొన్న సమైక్యవాదులు కోలాటంతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

టిడిపి ఆధ్వర్యంలో..

టిడిపి ఆధ్వర్యంలో..

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తున్న దృశ్యం. ఈ ర్యాలీలో పెద్దఎత్తున సమైక్యవాదులు పాల్గొన్నారు.

గోమాతతో

గోమాతతో

ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గోమాత ఫ్లెక్సీతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

గోమాతలతో

గోమాతలతో

ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గోమాతలతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

English summary
The Seemandhra people are continuing their agitation in Andhra and Rayalaseema region for Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X