కేరళలో ఘోర బస్సు ప్రమాదం: 14 మంది మృతి

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు తొలుత చెట్టును ఢీకొట్టింది. జారుడు రోడ్డుపై వెళ్తుండగా బస్సు ఈ ప్రమాదం జరిగింది. చెట్టుకు ఢీకొని బస్సు 25 అడుగుల కిందికి రోడ్డు మీద పల్టీలు కొట్టింది.
గాయపడినవారిని కొజికోడ్ వైద్య కళాశాల ఆస్పత్రికి, మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాలకు వెళ్లడానికి వారు బస్సు ఎక్కినట్లు చెబుతున్నారు.
బస్సు పూర్తిగా ధ్వంసమైంది. నాలుగు మృతదేహాలను ఆల్ సఫియా ఆస్పత్రికి, 9 మృతదేహాలను అలనలూర్ మౌలానా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications