ఇందిరా గాంధీ కాపురం చేయించారు: అశోక్ బాబు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్ర భార్యాభర్తల మధ్య స్పర్థలు వస్తే కలిసి కాపురం చేయాల్సిందేనని ఇందిరా గాంధీ 1972లో ఆదేశించారని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పర్చూరు అశోక్ బాబు అన్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన శనివారం ప్రసంగించారు. అమాయకమైన తెలంగాణ ఆడపిల్లకు, గడుసరి ఆంధ్ర మగపిల్లాడికి పెళ్లి చేస్తున్నామని, కలతలు వస్తే విడిపోవచ్చునని నెహ్రూ చెప్పారని, అయితే స్పర్థలు వచ్చాయని, ఆ సమయంలో ఇందిరా గాంధీ ఇద్దరూ కలిసి కాపురం చేయాల్సిందేనని చెప్పారని ఆయన వివరించారు.
చరిత్ర మరిచిపోయి మాట్లాడడం సరి కాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్ర కలిసి కాపురం చేస్తే పుట్టిన తొలి బిడ్డ హైదరాబాద్ అని, బిడ్డ పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత ముసలి మొగడిని వెళ్లిపోవాలంటే ఎక్కడికి పోతాడని ఆయన అన్నారు. 2003 రెండు ప్రాంతాల కాపురం హానీమూన్‌లా సాగిందని ఆయన అన్నారు. కలిసి ఉండాలా, విడిపోవాలా అనేది ప్రజలు నిర్ణయించాలని, ఒక ప్రాంతంవారు కలిసి ఉండాలని, మరో ప్రాంతం వారు విడిపోవాలని అంటున్నారని, మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.

నాలుగైదు పార్టీల వైఖరితో రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని, ప్రజాప్రతినిధులను పాలించడానికి మాత్రమే ఎన్నుకున్నారు గానీ విడదీయడానికి కాదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాజకీయ సమీకరణాలతో నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం రాజకీయ నేతల్లో చేతుల్లో లేదని, ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకించి నిర్ణయం తీసుకున్న పార్టీలు మనుగడ సాగించలేదని ఆయన అన్నారు.
విభజన వల్ల విద్యార్థులు, ఆర్టీసి సిబ్బంది, ఉద్యోగులు నష్టపోతారని ఆయన అన్నారు. తెలంగాణవాళ్లు ఉద్యమం చేస్తున్నప్పుడు తాము మాట్లాడలేదని ఆయన అన్నారు. తాము సమ్మె చేస్తున్నప్పుడు వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు. ఈ సభ జరుగుతున్న సందర్భంలో తెలంగాణవాదుల్లో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత తమకు ఉందని ఆయన అన్నారు. ఉద్యోగులు మాత్రమే పాల్గొంటారని పోలీసులు కోర్టులో కౌంటర్ వేశారని, వారికి సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చట్టం మీది గౌరవమే తమను మౌనంగా ఉంచుతోందని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ఇలాగే ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తనకు రాజకీయాలపై మోజు లేదని, తాను రాజకీయాల్లోకి వెళ్లబోనని అశోక్ బాబు చెప్పారు. తాము రాజకీయ నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా మారుతుందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నీతిపరమైన రాజకీయాలు చేయాలని అడిగుతున్నామని ఆయన చెప్పారు. పదవులకు రాజీనామా చేయాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఎంపీల్లా తమ ప్రాంత ఎంపీలు పనిచేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ నేతలకున్న చిత్తశుద్ధి తమ ఎంపీలకు లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలే సేవ్ ఆంద్రప్రదేశ్ సభ విజయానికి కారణమని ఆయన అన్నారు.
హైదరాబాద్ అందరి రాజధాని, తాము సభ పెడుతామని చెప్పామని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధానిగా ఉంటే సీమాంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడుతుందని ఆయన అన్నారు. సభకు వస్తుంటే బస్సులను రాళ్లతో కొట్టారని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్లు వస్తే తంతామని అంటున్నారని, ఇదేనా కడుపులో పెట్టుకోవడమేనా అని ఆయన అన్నారు. తీసుకున్న నిర్ణయంతో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు, వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఈ సభ విజయం హైదరాబాదులోని ఉద్యోగులకు నైతిక బలాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
రాజకీయ నాయకులపై ఒత్తిడి పెంచడానికి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈ సభ పెట్టామని, ఇది ప్రారంభం మాత్రమేనని ఆయన అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications