పిక్చర్స్: గంగిరెద్దుతో ఆనం వివేకా, తెలుగుతల్లిగా రోజా
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. శుక్రవారం వివిధ రూపాల్లో సీమాంధ్ర ఉద్యమం సాగింది. సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెసు, తెలుగదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
విజయవాడ, కడప, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సమైక్యాంధ్ర కోసం ర్యాలీలు ప్రదర్శనలు సాగాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ప్రదర్శన జరిగింది. విద్యార్థులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో మానవ హారం నిర్మించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా సమైక్య నినాదాన్ని ఎత్తుకుంది. దీంతో ఆ పార్టీ నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు.

అనంతపురంలో ఇలా..
అనంతపురంలో ఆందోళనకారులు సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. రాష్ట్రాన్ని విభజించడానికి వీలు లేదని నినదించారు.

గుంటూరులో ప్రదర్శన..
సమైక్యాంధ్ర డిమాండ్‌తో, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గుంటూరులో ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు.

కడపలో ఆటాడుతూ...
విద్యార్థులు ఆటలు ఆడుతూ సమైక్యాంధ్రకు అనుకూలంగా తమ నినదించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు.

నెల్లూరులో గంగిరెద్దుతో వివేకా..
విచిత్రమైన పద్ధతుల్లో వ్యవహరించడం నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డికి అలవాటు. ఆయన గంగిరెద్దును ఆడిస్తూ సమైక్యాంధ్రకు మద్దతు పలికారు.

విజయవాడలో ర్యాలీ..
విజయవాడలో దేవినేని అవినాష్ నాయకత్వంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిగింది. ప్రదర్శనకారులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

విజయవాడలో ప్రార్థనలు..
సమైక్యాంధ్రను కోరుతూ విజయవాడలో ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో హిందూముస్లింలు పాల్గొన్నారు.

చంద్రబాబుకు చురుకు..
గుంటూరు జిల్లా మంగళగిరిలో బస్సు యాత్ర నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సమైక్యాంధ్ర చురుకు తగిలింగి. ఉద్యోగులు, టీచర్లు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

చంద్రబాబు మాట కాస్తా మార్పు..
మంగళగిరి రాష్ట్ర విభజనపై చంద్రబాబు మాట కాస్తా మారింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తాను తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెసు విభజన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన చెప్పారు.

ఇలా ర్యాలీ...
సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు పాల్గొంటున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యార్థినీ విద్యార్థులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

సమైక్య ర్యాలీ..
సీమాంధ్ర ప్రాంతాల్లో సమైక్యవాదులు శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. వారు సమైక్యాంధ్రను కోరుతూ ఇలా ర్యాలీ నిర్వహించారు.

చంద్రబాబు మంగళగిరిలో..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆత్మగౌరవ యాత్ర శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో సాగింది. ఆయన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస తీరుపై మండిపడుతూ ప్రసంగించారు.

ప్రజల మధ్య చంద్రబాబు
చంద్రబాబు యాత్ర శుక్రవారం మంగళగిరిలో సాగింది. రాష్ట్ర విభజనకు పూనుకుని కాంగ్రెసు రాష్ట్రంలో చిచ్చు పెట్టిందని ఆయన విమర్శించారు. తనకు అధికారం ఇస్తే పరిస్థితిని చక్కదిద్దుతానని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు.

ఎడ్ల బండిపై చంద్రబాబు..
చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో ఎడ్ల బండిపై స్వారీ చేశారు. ఆత్మ గౌరవ యాత్రలో ఆయనకు ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవడం గమనార్హం.

శ్రీకాకుళంలో ఇలా..
సమైక్యాంధ్రకు అనుకూలంగా శ్రీకాకుళంలో మహిళలు ఇలా తమ మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు.

శ్రీకాకుళంలో మానవ హారం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో మహిళలు మానవ హారం నిర్మించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.

తెలుగుతల్లి వేషంలో రోజా
తెలుగుతల్లి వేషంలో రోజా సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. తిరుపతిలో ఆమె పక్కనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి.












Click it and Unblock the Notifications