అలజడి: సిటీలో జగన్‌పార్టీ ఫ్లెక్సీ దగ్ధం, విశ్వరూప్‌కి సెగ

ఆ పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో బస్సు యాత్ర చేస్తున్నారు. ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణవాదులు సీతాఫల్‌మండిలోని దిమ్మెను కూల్చివేసి, ఫ్లెక్సీలు, జెండాలను దగ్ధం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు.
విశ్వరూప్‌కు సమైక్య సెగ
మంత్రి విశ్వరూప్‌కు పశ్చిమ గోదావరి జిల్లాలో సమైక్య సెగ తగిలింది. ఆయనను సమైక్యవాదులు అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దానికి ఆయన స్పందిస్తూ.. నవంబర్ ఒకటో తేదిలోగా సమైక్యవాదానికి అనుకూలంగా ప్రకటన రాకుంటే రాజీనామా చేస్తానని చెప్పారు.
మా ఆకాంక్ష తెలిపేందుకే: అశోక్ బాబు
తాము తమ ఆకాంక్ష తెలిపేందుకే హైదరాబాదులో సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభను నిర్వహించామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఎవరు ఎక్కడైనా తమ అభిప్రాయాన్ని చెప్పవచ్చునన్నారు. తెలంగాణ నేతలు సీమాంధ్రలో సభలు పెట్టుకుంటే తాము సహకరిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications