జగన్ పార్టీలా టీ ప్రజలను ద్వేషించం: సోమిరెడ్డి

నమ్ముకున్నవారిని వాడుకుని గొంతు కోసే తత్వం తమ పార్టీది కాదని ఆయన అన్నారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేయాలంటే జేజమ్మ కాదు కదా, బ్రహ్మదేవుడు దిగి వచ్చినా సాధ్యం కాదని ఆయన అన్నారు. ఓట్ల కోసం విధానాలను మార్చుకునే పార్టీ వైయస్సార్ కాంగ్రెసు అని ఆయన అన్నారు.
తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడే నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించలేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ పార్టీని ఎలా ప్రశ్నిస్తుందని ఆయన అడిగారు. వరంగల్, కరీంనగర్ సభల్లో సమైక్యనినాదాలు చేస్తే సహిస్తారా అని ఆయన అడిగారు.
తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ లేఖను వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేదని ఆయన అన్నారు. సోనియాను ప్రశ్నించే దమ్ము వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేదని ఆయన అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్నాచెల్లెళ్లు దోచుకున్నారని ఆయన వైయస్ జగన్‌ను, షర్మిలను ఉద్దేశించి అన్నారు. సీమాంధ్రలో జరిగేవి రెచ్చగొట్టి, వసూలు చేసే ఉద్యమాలు కావని, ప్రజలనుంచి స్వచ్ఛందంగా వచ్చినవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications