హైదరాబాద్‌లో త్వరలో సమైక్యాంధ్ర సభ: లగడపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సమైక్యాంధ్ర సభ నిర్వహిస్తామని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఈ విషయంపై తాము అందరితో చర్చలు జరుపుతున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ నేతలు ప్రేరేపించడం వల్లనే సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినవారినే దాడులకు బాధ్యులను చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్నాం కాబట్టే విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తేగలుగుతున్నామని ఆయన అన్నారు. పోలీసు ఎస్కార్టు ఉన్నా సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఉద్యోగులపై దాడులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతామని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకే ఎక్కువ నష్టం జరుగుతుందని అనంతపురం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. అడ్డంకులు సృష్టించిన ఎపి ఎన్జీవోల సభ విజయవంతమైందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందనే కేంద్ర హోం మంత్రి ప్రకటనపై హైదరాబాదులో సమావేశం నిర్వహించి చర్చిస్తామని ఆయన చెప్పారు.

అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని, హైదరాబాదులో ఎన్జీవోలు సభ నిర్వహిస్తే తప్పేమిటని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు అమానుషమని ఆయన అన్నారు. దాడులకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+