హోటల్లో నలుగురి ఆత్మహత్య: తల్లీకొడుకుల హత్య

 Four of a family commit suicide
రాజమండ్రి/ కర్నూలు/ విశాఖ: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కొనసీమలోని అంబాజీపేటకు చెందిన వీరు రాజమండ్రిలోని హోటల్ రీజెన్సీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక కారణాల వల్లనే వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

అంబోజీపేటకు చెందిన వెంకట్ కిరణ్ అనే వ్యాపారి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రాజమండ్రిలోని తన అత్తవారింటికి వచ్చాడు. ఇంటి నుంచి తిరిగి వెళ్తున్నట్లు చెప్పి ఓ హోటల్లో వారు గది తీసుకున్నారు. గదిలో వెంకట్ కిరణ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. భార్య సీసాను పగులగొట్టి చేతులను కోసుకోవడంతో రక్తస్రావం జరిగి మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా పడుకున్నవారు పడుకున్నట్లే చనిపోయారు. వెంకట్ కిరణ్‌కు పామాయిల్ కర్మాగారం ఉంది. వివిధ దేశాల నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసి సరఫరా చేస్తుంటాడు.

ఇదిలావుంటే, కర్నూలు జిల్లా నంద్యాలలో తల్లీకొడుకులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లీకొడుకులను దుండగులు దారుణంగా నరికి చంపారు. ఆస్తి కోసమే వారిని హత్య చేసి ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు. నంద్యాలలోని సాయి ఆనందం అపార్టుమెంటులో ఈ హత్యలు జరిగాయి.

విశాఖలో గంజాయి పట్టివేత

విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఆర్టీసి బస్టాండ్ వద్ద జీపులో 100 కిలోల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నవారిలో ఒకతన్ని పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు.

పూరీలో భవనం కూలి నలుగురు మృతి

ఓడిశా రాష్ట్రంలోని పూరిలో ఓ ప్రాచీన భవం కూలి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడలు పూర్తిగా నానడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+