హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెనక్కి లేదు: హైదరాబాద్‌పై ప్రతిపాదనలు ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Three proposals on Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్ విషయంలో చేసిన మూడు ప్రతిపాదనలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ విషయంలో మూడు ప్రతిపాదనలున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇటీవల చేసిన ప్రకటనతో ఆ ప్రతిపాదనలేమిటనేది ఆసక్తిగా మారింది. ఈ ప్రతిపాదనల్లో ఒకటి - హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధికి జాతీయ రాజధాని ప్రాంతం పేరిట ప్రత్యేక హోదా కల్పించి మూడు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే హైదరాబాద్ కేంద్రపాలిత రాష్ట్రం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడతాయి.

దానివల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా హెచ్‌ఎండిఏలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)గా హైదరాబాద్ ఉంటుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా 65 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధాని చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మరో రెండు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. ఇందులో ఒక ప్రతిపాదనను ఆంధ్ర, రాయలసీమ ప్రజలు తిరస్కరించినందు వల్ల కార్యరూపం దాల్చడం కష్టం.

రెండోది - కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు పదేళ్ల ఉమ్మడి రాజధాని, ఆ లోపల ఆంధ్ర రాష్ట్రం కొత్త రాజధాని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉంది. అవసరమైతే మరో ఏడేళ్ల వరకూ పెంచేందుకూ అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు తెలంగాణకు చెందిన అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి.

మూడో ప్రతిపాదన - గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు వేరేచోట తమ ప్రాంతాల్లో సొంతంగా రాజధానులను నిర్మించుకోవడం. ఈ ప్రతిపాదన కింద పదేళ్లపాటు రెండు రాష్ట్రాలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసుకోవచ్చు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రజలు అంగీకరించరని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక కేంద్రం వద్ద మిగిలిన ఆప్షన్ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించడమేనని, ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా కొనసాగించాలని పట్టుదలతో కేంద్రం ఉంది.

ఢిల్లీ తరహాలో హెచ్‌ఎండిఏగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ హోదా కల్పిస్తారు. అయితే విడిగా దీనికి చట్టసభ ఉండదు. సమస్యకు త్వరితగతిన పరిష్కారం కనుగొనేందుకు ఇంతకంటే మించిన దారి లేదని ఉన్నతస్థాయి పోలీసు వర్గాలు తెలిపాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ హోదా కల్పించి ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ కేంద్రపాలిత రాష్ట్రాలను ఏర్పాటు చేస్తారు. అప్పుడే హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధానిగా నిర్ణయించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుత స్థితిలో హైదరాబాదును పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచి, శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకునే ఢిల్లీ తరహా విధానానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం ఫైనల్ అని, దాని నుంచి వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు సబంధించి విధివిధానాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని ఆయన అన్నారు.

English summary
Union government is examining three proposals on Hyderabad on the bifurcation of Andhra Pradesh state issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X