ఇంటి భోజనానికి అనుమతించండి: జగన్, కోర్టు ఓకే

ఇటీవల సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ జైలులోనే దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఆయన దీక్షను ఐదు రోజుల తర్వాత భగ్నం చేశారు. నిమ్స్‌లో ఆయనకు చికిత్స నిర్వహించారు. ఫ్లూయిడ్స్ ఎక్కించారు. జగన్ కోలుకున్నాక చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో నాలుగు వారాల పాటు ఇంటి భోజనం తీసుకోవాలని నిమ్స్ వైద్యులు జగన్‌కు సూచించారు. దీంతో జగన్ తనకు ఇంటి భోజనం తినేందుకు అనుమతించాలని ఈ రోజు కోర్టులో మెమో దాఖలు చేశారు. కాగా, జగన్‌కు ములాఖత్‌లకు అనుమతిస్తున్నారు.
మరోవైపు, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ఛార్జీషీటును దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే సిబిఐ డైరెక్టర్ అనుమతిని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆస్తుల కేసులో ఇటీవలే మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి గీతా రెడ్డిలు సిబిఐ అధికారులు విచారించారు.












Click it and Unblock the Notifications