కుక్కలను తిప్పితే నెలకు రూ. 5.72 లక్షలా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదిరిపోయే సైడ్ బిజినెస్!

సాధారణంగా సైడ్ బిజినెస్ అంటే చిన్నపాటి అదనపు ఆదాయం వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ న్యూయార్క్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాత్రం తన హాబీని కోట్ల రూపాయల వ్యాపారంగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కుక్కలంటే అమితమైన ప్రేమ ఉన్న కోబీ గుడ్‌హార్ట్ అనే యువకుడు, పార్ట్‌టైమ్‌గా "డాగ్ వాకర్"గా పనిచేస్తూ నెలకు ఏకంగా 6,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ.5.72 లక్షలకు పైగా) సంపాదిస్తున్నాడు.

పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే, ఖాళీ సమయాన్ని స్మార్ట్‌గా ఉపయోగించుకుని "Goodheart Dog Co" పేరుతో ప్రత్యేక పెట్-కేర్ సర్వీస్‌ను ప్రారంభించాడు. మొదట్లో కేవలం హాబీగా మొదలైన ఈ పని, ఇప్పుడు అతనికి భారీ అదనపు ఆదాయ వనరుగా మారింది. కోబీ ప్రతిరోజూ ఉదయం ఆఫీస్‌కు వెళ్లే ముందు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో, అలాగే వారాంతాల్లో కుక్కలను బయటకు తీసుకెళ్లి వాకింగ్ చేయిస్తుంటాడు. బిజీ జీవితంలో తమ పెంపుడు జంతువులకు సమయం కేటాయించలేని యజమానులు అతని సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు.

software-engineer-from-newyork-getting-rupees-5-lakhs-72-thousand-on-a-month-for-doing-part-time-as

ప్రస్తుతం అతని వద్ద డజన్ల సంఖ్యలో రెగ్యులర్ క్లయింట్లు ఉన్నారని సమాచారం. ఒక్కో కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు సమయం, దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తాడు. కేవలం వాకింగ్ మాత్రమే కాదు, పెంపుడు జంతువుల సంరక్షణ, ఫీడింగ్, ప్లే టైమ్, పెట్ సిట్టింగ్ వంటి అదనపు సేవలను కూడా అందిస్తున్నాడు. కోబీ తన వ్యాపారాన్ని సోషల్ మీడియా, పెట్ కమ్యూనిటీ యాప్స్ ద్వారా ప్రచారం చేశాడు. ముఖ్యంగా కుక్కలతో దిగిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో అతని సేవలకు మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం అతని "Goodheart Dog Co" స్థానికంగా మంచి బ్రాండ్‌గా మారింది.

ఈ సైడ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ.. "నాకు కుక్కలంటే చాలా ఇష్టం. నేను ఇష్టపడే పనినే చేస్తూ డబ్బు సంపాదించడం ఆనందంగా ఉంటుంది. ఇది పని అనిపించదు" అని కోబీ చెప్పాడు. అలాగే, ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ ఉండేలా టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా పెట్-కేర్ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో పెంపుడు జంతువుల సంరక్షణ కోసం ప్రజలు భారీగా ఖర్చు చేస్తున్నారు. దీంతో డాగ్ వాకింగ్, పెట్ సిట్టింగ్, పెట్ ట్రైనింగ్ వంటి సేవలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది.

కోబీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "హాబీని కెరీర్‌గా మార్చుకుంటే ఇలానే ఉంటుంది" అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చాలామంది యువతకు అతని ప్రయాణం స్ఫూర్తిగా మారింది. పార్ట్‌టైమ్ పని కూడా సరైన ప్లానింగ్‌తో చేస్తే లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చని కోబీ నిరూపించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+