జగన్, బాబు విభజనకే, కెసిఆర్‌కు వణుకు: శైలజానాథ్

హైదరాబాద్‌లో ఎపి ఎన్జీవోల సభను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు వణుకు పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ తన దొరబుద్ధిని వదులుకోవడం లేదని ఆయన అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తెరాస నాయకులు బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎపి ఎన్జీవోల సభ విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించిందనే విమర్సను ఆయన ఖండించారు. నెక్లెస్ రోడ్డులో ప్రదర్శనకు తెలంగాణవాళ్లకు అనుమతి ఇచ్చిన విషయం మరిచిపోతే ఎలా అని ఆయన అడిగారు.
రాష్ట్రం సమైక్యంగానే ఉందని, సభలూ సమావేశాలూ పెట్టుకునే హక్కు తమకు ఉందని ఆయన అన్నారు. దొర బుద్ధిని కెసిఆర్ బయటపెట్టుకున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఓట్ల కోసం, సీట్ల కోసం మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామనే మాటలో కుట్ర ఉందని, శాసనసభకు తెలంగాణ తీర్మానం వస్తే సంభవించే పరిణామం తెలియదా అని ఆయన అన్నారు. తీర్మానాన్ని ఓడించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రాజీనామాలు ఆమోదింపజేసుకుంటే తీర్మానాన్ని ఓడించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం అందరికీ ఉందని ఆయన అన్నారు.
రాజకీయ పార్టీలను కలుపుకుని ఏపీఎన్జీవోలు ఐక్యంగా ఉద్యమంచాలని కాంగ్రెసు సీమాంధ్ర మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న ఆందోళనలో పాల్గొనేందుకై వచ్చిన ఎంపీ మాగుంటను ఏపీ ఎన్జీవోలు ప్రకాశం జిల్లాలో ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికలను రెఫరెండమ్‌గా తీసుకోవాలని ఆంటోని కమిటీని కోరినట్లు చెప్పారు. తమపై అనర్హత వేటు వేసే వరకు పోరాడుతామని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాలని సీమాంధ్ర మంత్రులను కోరుతామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. ఎవరూ ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదని, అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications