నాకే చెబుతావా అంటూ... బావ మరిదిని గోంతుకోసి హత్య చేసిన బావ...!

పాత పగను మనసులో పెట్టుకున్న ఓ బావ తన బావమరిదిని దారుణంగా హత్యచేశాడు. గోడవలు లేకుండా సర్దుకోవాలని చెప్పిన బామ్మర్దిని నడి రోడ్డుపై గోంతు కోసి హత్య చేశాడు. దీంతో చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దాలని వచ్చిన బావ మరిది కిరతంగా హత్య చేయబడ్డాడు. దీంతో ఎంజరుగుతుందో తెలుసుకునే లోపే నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.

 సోదరి కాపురం కోసం వచ్చి....

సోదరి కాపురం కోసం వచ్చి....

బావా బామ్మర్ధుల మధ్య వివాదాలు సర్వసాధరణంగా కొనసాగుతాయి. చెల్లెలు కాపురం చక్కదిద్దేదిద్దేందుకు ప్రతి సోదరుడు జోక్యం చేసుకోవడం సర్వసాధరణం...అయితే బావమరిది జోక్యం ఓ బావకకు నచ్చలేదు. చెల్లెలిని తీసుకువెళ్లడానికి వస్తే... తనకే నీతులు చెబుతావా అంటూ తన ఇంటికి వచ్చిన బావ మరిదిని నమ్మించి హత్య చేశాడు. అందరు చూస్తుండగానే బామ్మర్ది గొంతుకోసి హత్య చేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

బావ, బావమరిదిల మధ్య ఘర్షణ

బావ, బావమరిదిల మధ్య ఘర్షణ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఆదిలాబాద్ జిల్లాలోని సుందరయ్యనగర్ కాలనీలో జీవిస్తున్న సంతోష్, మమత దంపతుల మధ్య ఘర్షణలు రావడంతో సంవత్సరం క్రితమే మమత తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇరువురి వివాహం కావడంతో ఒక పాప, మరియు బాబు ఉన్నారు. అయితే భార్య పుట్టింటికి వెళ్లిపోయిన తర్వాత తాను మారానని, భవిష్యత్ లో ఎలాంటీ ఘర్షనలకు అవకాశం ఇవ్వనని చెప్పడంతో మమత తిరిగి భర్త వద్దకు చేరుకుంది. ఈ క్రమంలోనే సంతోష్ బావమరిది మనోజ్‌కు గోడవ చెలరేగింది. బావా, బావమరిదుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వావాదం జరిగింది. అయితే ఎట్టకేలకు భార్యను ఒప్పించిన సంతోష్ తన ఇంటికి తీసుకువచ్చాడు.

ఇంటికి వచ్చిన బామ్మర్ధిపై హత్య

ఇంటికి వచ్చిన బామ్మర్ధిపై హత్య

అయితే తన సోదరీ అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆమె సంసారాన్ని ఆరా తీయడంతో పాటు కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు మనోజ్ ఆదిలాబాద్‌లోని తన చెల్లెలి ఇంటికి చేరుకున్నాడు. అయితే సంవత్సరం క్రింద జరగిన సంఘటనను తన మనసులోనే పెట్టుకున్న సంతోష్ బావమరిదిని కడతేర్చాలని భావించాడు. దీంతో ఇంటికి వచ్చిన బావమరిది మనోజ్ తో టీ తాగుతామని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం పథకం ప్రకారమే నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+