ఆదిలాబాద్ కలెక్టర్‌పై గోనె ప్రకాశ్ రావు హాట్ కామెంట్స్.. బయోడేటా ఎందుకు, ఆరా తీసిందని..
బ్యూరోక్రాట్లు- నేతల మధ్య చిన్న చిన్న పట్టింపులు, గొడవలు ఉండనే ఉంటాయి. అయితే అవీ కొన్ని సందర్భాల్లో పీక్‌కి చేరతాయి. నిజానికి అధికారులకు కూడా పవర్ ఉన్న.. వారిని నేతలు పనిచేయనీయడం లేదు. ఇదీ అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు ఐఏఎస్, అంటే గౌరవం, మర్యాద ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నా.. ఆ స్థాయిలో లేవు. అవును చెప్పిన పని వినలేదనో.. మరో కారణం చేత బ్యూరోక్రాట్లపై కూడా ఆరోపణలు చేస్తున్నారు.

కలెక్టర్ ఆరా..
గోనె ప్రకాశ్ రావు.. కాంగ్రెస్ రెబల్ లీడర్, మాజీ ఎమ్మెల్యే.. ఆయన ఫైర్ బ్రాండ్.. నేతలపై అయితే కామెంట్స్ మాములుగా చేయరు. కానీ బ్యూరోక్రాట్లను కూడా వదలడం లేదు. విషయ పరిజ్ఞానం ఉండటంతో నేతలపై కామెంట్స్ చేసేవారు. కానీ అధికారులను కూడా వదలడం లేదు. అవును ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై కామెంట్స్ చేశారు. ఆమె తన గురించి ఆరా తీశారని తెలియజేశారు. తన గురించి డేటా ఎందుకు అని ఆయన అడిగారు. దీంతో ఏదో అనుమానం కలుగుతుందని వివరించారు.

బయోడేటా ఎందుకు
సిక్తా తన బయోడేటా గురించి ఓ జర్నలిస్టును అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారని గోనె ప్రకాశ రావు చెప్పారు. తన గురించి డేటా ఎందుకు అని అడిగారు. ఆ తర్వాత సిక్నా గురించి గోనె హాట్ కామెంట్స్ చేశారు. ఆమె ఛాంబర్ లో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నలుగురు జెడ్పీ ఛైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, 22 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని పేర్కొన్నారు. అంత మంది అక్కడ ఎందుకు ఉన్నారని గోనె ప్రశ్నించారు. వారందరూ కలెక్టర్ ఛాంబర్‌లో ఏం చేస్తున్నారని నిలదీశారు.

మీకు తగదు
తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం టీఆర్ఎస్ పార్టీకి తగదని చెప్పారు. ప్రతి విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు పలికిందని ఆయన వివరించారు. అంతేకాదు తెలంగాణలో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్- కేసీఆర్ అంటే ఏంటో జనాలకు తెలిసిందని తెలిపారు. బుద్ది చెప్పేందుకు తగిన సమయం కోసం చూస్తున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వారు ఏంటో చూపిస్తారని తెలిపారు. గోనె ప్రకాశ్ రావు.. క్యాజుబల్‌గా విరుచుకుపడుతుంటారు. ఇక బ్యూరోక్రాట్ గురించి మాత్రం ఈ రేంజ్‌లో కామెంట్స్ చేయడం పలు సందేహాలకు తావిస్తోంది.