ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: కారును డీ కొట్టిన కంటైనర్.. నలుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు వెళ్తున్న ఒక కారును కంటైనర్ ఢీ కొట్టటంతో కారులో ప్రయాణం చేస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఈ దుర్ఘటనతో జాతీయ రహదారి రక్తసిక్తం అయ్యింది. డిసెంబర్ లో వివాహం జరగనున్న యువతి జుబియా కోసం హైదరాబాద్ లో షాపింగ్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలంలోని సీతాగొంది దగ్గర ఈ రోజు తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వేగంగా కంటైనర్ ఢీ కొట్టటంతో కారులో ప్రయాణించే వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు కారులో వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు ఆదిలాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు సమాచారం.
వివాహం కోసం పెళ్లి షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోరం
మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సయ్యద్ రఫముల్లా అహ్మద్ ఆదిలాబాద్ జెడ్పీలో డీఈ గా పని చేస్తున్నారు. కాగా మృతుల్లో ఆయనతో పాటు శభియా హష్మీ, సయ్యద్ వజాహద్ తో పాటు కార్ డ్రైవర్ శంషోద్దీన్ ఉన్నారు. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళ జుబియాను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె వివాహం నిశ్చయమైన నేపధ్యంలో అంతా కలిసి పెళ్లి షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరగటంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాహనాలు నడిపేటప్పుడు తస్మాత్ జాగ్రత్త
ఇక చలి కాలం కావటంతో ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక పోవటం, విపరీతమైన వేగం వెరసి ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎంతగా చెబుతున్నా వాహనచోదకుల నిర్లక్ష్యం ఎంతోమంది నిండు ప్రాణాలు బలి తీసుకుంటుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాల వల్ల తీరని దుఃఖంలో మునిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి, జాగ్రత్తగా వాహనాలు నడిపితే కొంత మేరకు ప్రమాదాలను నివారించే వీలుంటుంది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications