హవ్వా.. పేరుకు స్వామిజీ.. కానీ మైనర్ బాలికపై లైంగికదాడి..?

ఆదిలాబాద్ జిల్లా నేరేడిగోండలో దారుణం జరిగింది. ఇస్పూర్ తాండ గ్రామంలో మైనర్ బాలికపై దొంగబాబా అత్యాచార యత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నేరేడిగోండ మండలం రాజుర గ్రామ శివారులో ఓ గుట్టపై 7 ఏళ్లుగా జాధవ్ ఆత్మారం ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. వేసవిలో ఆశ్రమం వద్ద నీటి వసతి లేకపోవడంతో ఇస్పూర్ తండా గ్రామస్థులు గ్రామం వద్ద అతనికి వసతిని ఏర్పాటు చేశారు.

ఈ నెల 16న స్వామీజీకి పండ్లు ఇవ్వడానికి ఓ కుటుంబం తమ కుమార్తెను పంపించింది. ఎంత సేపైనా బాలిక తిరిగి రాకపోవడంతో స్వామిజీ నివాసం వద్దకు తల్లిదండ్రులు వెళ్లారు. అక్కడ వారికి తమ కుమార్తె స్పృహ కోల్పోయి కనిపించింది. బాలికను వారు ఇంటికి తీసుకువచ్చి చికిత్స అందించారు. ఆస్పత్రిలో కోలుకున్నాక బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పింది.

 swamiji attempted to rape minor girl

గ్రామస్తుతో కలిసి తల్లితండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మారం స్వామీజీ పై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాబా వేషంలో ఉండి మోసం చేశాడు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. అయితే కొత్తగా డెల్టా వేరియంట్ భయపెడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+