టీ ఇన్ పేపర్ బౌల్: యమ్మీ యమ్మీ టేస్టీ.. ఆ పేపర్ ఎందుకు కాలాదంటే..

టీ చేయాలంటే అల్యూమీనియం పాత్ర‌నో, ఇత్త‌డి పాత్ర‌నో, రాగి పాత్ర‌నో లేదంటే స్టీల్ పాత్ర‌నో ఇంకా ఇత‌ర ఏదైనా లోహ‌పు పాత్ర‌నో వినియోగిస్తాం. అలానే చేయాలి.. లేదంటే టీ కాదు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాయ్ వాలా హ‌న్నూ భాయ్ మాత్రం పేప‌ర్ బౌల్‌లో చాయ్ తయారు చేస్తాడు అవును మీరు విన్నది నిజమే.. కాగిత‌పు గిన్నెను పొయ్యిమీద పెట్టి.. దానికింద మంట‌పెట్టినా పేప‌ర్ కాలిపోకుండా చాయ్ చేసి చూపిస్తున్నాడు.

20 ఏళ్లుగా ఛాయ్..

20 ఏళ్లుగా ఛాయ్..

ఆదిలాబాద్ జిల్లా చాందాటి గ్రామానికి చెందిన షేక్‌ హ‌న్నూభాయ్ గ‌త 20 ఏళ్లుగా చాయ్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో కాగిత‌పు గిన్నెలో చాయ్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రుస్తున్నారు. హ‌న్నూ భాయ్ చాయ్‌కి స్థానికంగా డిమాండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని నెల‌ల క్రితం ఓ ఆదివాసి గూడెంలో మోద‌గాకుల్లో చాయ్ త‌యారు చేయ‌డాన్ని హ‌న్నూ చూశాడ‌ట‌. దాంతో తాను కూడా ఎప్పటిలాగే కాకుండా డిఫ‌రెంట్‌గా చాయ్ త‌యారు చేయాల‌ని డిసైడ్ అయ్యాడు.

పాలు నీళ్లు పోసి..

పాలు నీళ్లు పోసి..

న్యూస్ పేప‌ర్‌, మ‌రేదైనా కాగితాన్ని గిన్నెలా చుట్టి అందులో పాలు, నీళ్లు పోసి మంట‌పై పెట్టి చాయ్ త‌యారు చేయ‌డం మొద‌లుపెట్టాడు. మంట‌పై పెట్టినా పేప‌ర్ కాలిపోకుండా ఉంటుండ‌టంతో ఇక పేప‌ర్ బౌల్‌లో చాయ్ చేయ‌డం కంటిన్యూ చేశాడు. ఆ చాయ్ రుచి కూడా ఉండ‌టంతో డిమాండ్ అమాంతం పెరిగింది. అందుకే, త‌న పేప‌ర్ చాయ్ చాలా రుచిగా ఉంటుంద‌ని, చుట్టుప‌క్క‌ల గ్రామాల వాళ్లు కూడా త‌న ద‌గ్గ‌ర చాయ్ కోసం వ‌స్తార‌ని హ‌న్నూ భాయ్ చెబుతున్నాడు.

నమ్మలేదు.. తర్వాత నమ్మి

నమ్మలేదు.. తర్వాత నమ్మి

హ‌న్నూభాయ్ కాగిత‌పు పాత్ర‌లో చాయ్ తయారు చేస్తానంటే ముందుగా ఎవ‌రూ న‌మ్మ‌లేద‌ట‌. కాగిత‌పు పాత్ర నిప్పుల మీద పెడితే కాలిపోకుండా ఉంటుందా..? అని ఎగ‌తాళి చేశార‌ట‌. హ‌న్నూ భాయ్ వాళ్ల కళ్ల ముందే పేప‌ర్ బౌల్‌లో చాయ్ త‌యారుచేసి చూపించేస‌రికి ఆశ్చ‌ర్య పోయార‌ు. ఇప్పుడు ఆ చాయ్ రుచికి అల‌వాటు ప‌డిన త‌ర్వాత అడిగి మ‌రీ పేప‌ర్ బౌల్‌లో చాయ్ తయారు చేయించుకుంటున్నార‌ని తెలిసింది.

నిప్పుల మీద కాగితపు గిన్నె

నిప్పుల మీద కాగితపు గిన్నె

కాగిత‌పు గిన్నెను నిప్పులమీద పెట్టినా కాలిపోకపోవ‌డం వెనుక ఒక సైంటిఫిక్ రీజ‌న్ ఉందని అదిలాబాద్ జిల్లాకు చెందిన సైన్స్ ఆఫీస‌ర్ ర‌ఘు ర‌మ‌ణ చెప్పారు. త‌డి, పొడి కాగితాల జ్వ‌ల‌న ఉష్ణోగ్ర‌తల్లో తేడా ఉంటుంద‌ని, హ‌న్నూ భాయ్ కాగిత‌పు గిన్నెను మంట‌పై పెట్ట‌డానికి ముందు దానిలో పాలు, నీళ్లు పోస్తున్నాడ‌ని, దాంతో కాగితం త‌డిసి దాని జ్వ‌ల‌న ఉష్ణోత్ర పెరుగుతుంద‌ని, ఆ కార‌ణంగానే కాగితం కాలిపోకుండా ఉంటుంద‌ని ర‌ఘు ర‌మ‌ణ వివ‌రించారు.

డిఫరెంట్

డిఫరెంట్


సైన్స్ ఎలా ఉన్నా.. హన్నూభాయ్ చాయ్ మాత్రం వినూత్నంగా ఉంది. టీ ప్రియులు అంతా కలిసి.. అతని చాయ్ కోసం ఎగబడుతున్నారు. మిగతావారు మాత్రం ఆ ఛాయ్ ఎప్పుడెప్పుడు తాగాలా అని ఆలోచిస్తున్నారు. వినడానికి మాత్రం ఆ ఛాయ్ డిఫరెంట్‌గా ఉంది. మరీ అందుబాటులో ఉన్నవారు జర టెస్ట్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+